భర్త డ్యాన్స్‌కు రాలేదని మహిళ ఆత్మహత్యాయత్నం
బీజింగ్: తనతో కలిసి గ్రూప్ డ్యాన్స్ చేయడానికి భర్త నిరాకరించాడని మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చైనాలో ఈ సంఘటన జరిగింది. 53 ఏళ్ల మహిళ మద్యంలో క్రిమిసంహారక మందులు కలుపుకుని సేవించింది.
భర్త వెంటనే గుర్తించి ఆస్పత్రికి తరలించాడు. చైనాలో మధ్య వయస్కులు, ఆ పైవయస్కులు గ్రూపులుగా ఏర్పడి నృత్యం చేయడం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆత్మహత్యకు పాల్పడిన మహిళకు గ్రూప్ డ్యాన్ అంటే ఎక్కడ లేని మక్కువ. భర్త అందుకు నిరాకరించడంతో ఆమె తట్టుకోలేకపోయింది.

తనకు జీవించాలని లేదని ఆమె కూతురుతో చెప్పింది. భర్త, కూతురు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు అత్యవసరంగా చికిత్స చేశారు. గ్లోబల్ టైమ్స్ ఈ వార్తాకథనాన్ని ప్రచురించింది.
గ్రూప్ స్క్వేర్ డ్యాన్స్ చేయడం తమ భార్యకు మక్కువ అనే విషయం తనకు తెలుసునని భర్త అన్నాడు.












Click it and Unblock the Notifications