పాఠశాలపై కూలిన హెలికాప్టర్: ఉక్రెయిన్ మంత్రి, ఇద్దరు పిల్లలు సహా 18 మంది మృతి
కీవ్: రష్యా దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ దేశంలో తాజాగా, ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్ మోనాస్ టిస్కీ సహా 18 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ కు సమీపంలోని బ్రోవరీ ప్రాంతంలో ఒక కిండర్‌గార్టెన్ పాఠశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. వాతావరణం అనుకూలించని కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

జాతీయ పోలీసు అధిపతి ఇగోర్ క్లెమెన్కో మాట్లాడుతూ.. "ప్రస్తుతం మొత్తం 16 మంది మరణించారు" అని తెలిపారు. భవనంపైకి హెలికాప్టర్ ఎలా కూలిపోయిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బ్రోవరీలో జరిగిన ఈ దుర్ఘటనలో 29 మంది గాయపడ్డారని, 18 మంది మరణించారని కైవ్ ప్రాంతీయ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి ఒలెక్సీ కులేబా తెలిపారు.
Ukraine's interior minister and his deputy among 16 killed in helicopter crash near Kyiv. It's currently unknown what caused the accident. https://t.co/wGx6B3bNCt pic.twitter.com/3NgPBawVyY
— Breaking Aviation News & Videos (@aviationbrk) January 18, 2023
రాయిటర్స్ కథనం ప్రకారం.. ఉక్రెయిన్‌లోని బ్రోవరీ నగరంలో హెలికాప్టర్ భవనంపైకి దూసుకెళ్లింది. బ్రోవరీ నగరం కైవ్‌కు ఈశాన్యంగా 12 మైళ్ల దూరంలో ఉంది. ప్రమాదం అనంతరం అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, ప్రాణనష్టంపై దర్యాప్తు జరుపుతున్నామని రాష్ట్రపతి సహాయకుడు తెలిపారు.
ఈ సంఘటన నర్సరీకి సమీపంలో జరిగిందని, ఇక్కడ చాలా మంది పిల్లలు చిక్కుకుపోయారని భయపడుతున్నారు. హెలికాప్టర్ ఢీకొనడంతో భవనం దగ్ధమైనట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం గురువారం ఉదయం ప్రాంతంలో ఒక హెలికాప్టర్ కూలిపోయినట్లు ధృవీకరించింది. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం డిప్యూటీ హెడ్, కిరిలో టిమోషెంకో, టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో ప్రాణనష్టం, పరిస్థితుల గురించి సమాచారాన్ని పొందడానికి తాను కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications