గర్భిణీ అయిన వరల్డ్ పాప్ సింగర్ నగ్నంగా 'వి' ఫోజులు
ప్రఖ్యాత ప్రపంచ గాయని క్రిస్టినా అగ్యులోరా నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించింది. ఆమె ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మను ఇవ్వనుంది. ఆమె గర్భవతి. అలాగ ఆమె న్యూడ్‌గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సంచలనం సృష్టించిది. ఆమె వయస్సు 33 ఏళ్లు.
ఈ గాయనికి ఈసారి ఆడపిల్ల పుట్టనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. తన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూపించడానికి ఆమె పూర్తి నగ్నంగా మారి వి మాగజైన్‌కు ఫోటో ఫోజులు ఇచ్చిందని డైలీ మెయిల్ పేర్కొంది. తెల్లటి బ్యాక్ గ్రౌండులో పూర్తి బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ఫోటోను వి మేగజైన్ వెబ్ సైట్ ప్రచురించింది.

నగ్నంగా ఇలా ఎందుకు ఫోటో తీయించుకున్నారని ఆమెను ప్రశ్నిస్తే.. తాను ఓ మహిళనని, తన జీవితంలోని ప్రతి దశలోను తన శరీరం పట్ల తాను చాలా గర్వపడుతున్నానని, ఏమాత్రం భయం లేకుండా, ఆత్మ విశ్వాసంతో ఇది చెబుతున్నానని పేర్కొంది.
ఈ నెలలోనే ఆమె బిడ్డకు జన్మను ఇవ్వనుందట. కాగా అగ్యులేరా, ఆమె భర్త మాథ్యూ రట్లర్ ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. అగ్యులేరాకు ఇప్పటికే తన మాజీ భర్త జొర్డాన్ బ్రట్మన్‌తో ఆరేళ్ల కొడుకు మాక్స్ ఉన్నాడు.












Click it and Unblock the Notifications