Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాను కోరుకొన్న అమ్మాయి వేరే వ్యక్తితో ఉందని, అతను ఏం చేశాడంటే

బ్రెజిల్ :తాను కోరుకొన్న అమ్మాయి మరో విటుడితో ఉందని తెలిసి కోపం పట్టలేక ఓ వ్యక్తి ఆరుగురిని కాల్చిచంపాడు. ఈ ఘటన బ్రెజిల్ లో సంచలనం సృష్టించింది. తాను కోరుకొన్న అమ్మాయిని దొరకని కారణంగా ఈ చర్యకు పాల్పడ్డాడు,. అయితే ఆరుగురిని చంపిన తర్వాత ఆయనే పోలీసులకు లొంగిపోయాడు.

బ్రెజిల్ లోని సావోపౌ రాష్ట్రంలోని జబోటికబల్ అనే నగరంలో బ్రోతల్ హౌజ్ లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఓ 27 ఏళ్ళ వ్యక్తి వచ్చి తాను కోరుకొన్న అమ్మాయి గురించి బ్రోతల్ హౌజ్ లో వాకబు చేశాడు.

అయితే అప్పటికే ఆ యువతి వేరే విటుడితో ఉంది. ఈ విషయాన్ని నిర్వాహకులు యువకుడికి చెప్పారు. దీంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. బ్రోతల్ హౌజ్ వద్ద పార్క్ చేసిన తన కారులో ఉన్న తుపాకీని తీసుకొని వచ్చి కాల్పులు జరిపాడు.

client kills 6 men as preferred sex worker was busy with them

తాను కోరుకొన్న యువతిని, ఆమె తో పాటు ఉన్న వ్యక్తిని కాల్చిచంపాడు. వీరిద్దరితో పాటు మరో నలుగురిని కాల్చివేశాడు. కాల్పుల ఘటనతో బ్రోతల్ హౌజ్ లో ఉన్న వ్యభిచారిణులు, విటులు పారిపోయారు. నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి లొంగిపోయాడు. నిందితుడు క్షురకుడుగా పనిచేస్తాడని పోలీసులు గుర్తించారు.అయితే గతంలో అతనికి ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు చెబుతున్నారు.

అయితే బ్రోతల్ హౌజ్ కు వెళ్ళి ఎందుకు అతను ఆరుగురిని చంపారనే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలను వారు సేకరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+