ఓటింగ్‌కు ముందు ట్రంప్‌కు ఝలక్, హిల్లరీ క్లింటన్‌దే గెలుపు!!
వాషింగ్టన్: రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్. సర్వే ప్రకారం 90 శాతం మంది డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తేలింది. మరికొద్ది గంటల్లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ముందస్తు ఓటింగ్ ద్వారా ఇప్పటికే నాలుగు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎవరు అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనున్నారనే దానిపై మీడియా సంస్థలు పలు సర్వేలు నిర్వహించాయి. తాజా సర్వేల నివేదిక ప్రకారం తొంబై శాతం మంది హిల్లరీ వైపే మొగ్గు చూపుతున్నారట. రాయిటర్స్/ ఇప్సాస్ స్టేట్ ఆఫ్ నేషన్ ప్రాజెక్టు ఈ మేరకు వెల్లడించింది.
గత వారంతో పోల్చుకుంటే ట్రంప్ కంటే హిల్లరీ ముందంజలో ఉన్నట్లు తెలిపింది. ఎలక్ట్రోరల్ కాలేజి ఓట్లలో ట్రంప్‌కు 235 రాగా, హిల్లరీకి 303 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపొందాలంటే కనీసం 270 ఓట్లు రావాలి. ఫలితాల్లో ప్రధాన పాత్ర పోషించనున్న ఫ్లోరిడా, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలు హిల్లరీకి అనుకూలంగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి 3 పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీ ఉన్నారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత మంగళవారం రాత్రి నాటికి ఉత్తర కరోలినాలో ఫలితాలు మొదటగా వెల్లడవుతాయి. తెల్లజాతీయులు ఎక్కువగా ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ముప్పై శాతం మంది తెల్ల జాతీయులు ట్రంప్ వైపు నిలబడగా, క్లింటన్ నల్లజాతీయుల ఓటర్ల నుంచి 85 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఉత్తర కెరోలినాలో ట్రంప్.. హిల్లరీ కంటే ఒక పాయింట్ ముందంజలో ఉన్నారు. ట్రంప్‌కు 47 శాతం మద్దతు, హిల్లరీ 46 పాయింట్ల మద్దతుతో ఉన్నారు. ఫ్లోరిడాలో ఉన్న 29 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు ట్రంప్‌కు కీలకం కానున్నాయి.
ఒకవేళ హిల్లరీ క్లింటన్ గెలుపొందితే మూడు పెద్ద రాష్ట్రాలైన ఒహైయో, మిచిగాన్, పెన్సుల్వేనియాలో ఏదో ఒక దాంట్లో గెలుపొందితే సరిపోతుంది. అదే ట్రంప్ గెలుపొందాలంటూ ఒహైయో, మిచిగాన్ రాష్ట్రాల్లో తప్పనిసరిగా గెలుపొందవలసి ఉంటుంది.












Click it and Unblock the Notifications