హిల్లరీ సర్‌ప్రైజ్!: ట్రంప్‌కు నోబెల్? కండిషన్స్ అప్లై!
మాజీ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతికి మద్దతు ఇస్తానని ఒక షరతుపై ప్రకటించారు. ఈ షరతు ప్రకారం.. ఉక్రెయిన్ భూభాగంలో ఒక్క అంగుళం కూడా రష్యాకు ఇవ్వకుండానే.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించగలిగితే తాను నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని హిల్లరీ క్లింటన్ అన్నారు.
హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య అలస్కాలో జరిగిన కీలక సమావేశానికి కొన్ని గంటల ముందు "రేజింగ్ మోడరేట్స్'తో మాట్లాడినప్పుడు హిల్లరీ క్లింటన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ట్రంప్ నిజంగా ఈ భయంకరమైన యుద్ధాన్ని ఉక్రెయిన్ భౌగోళిక పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకుండా ముగించగలిగితే, నేను ఖచ్చితంగా ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయగలను " అని హిల్లరీ క్లింటన్ అన్నారు.

హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య 2016 అధ్యక్ష ఎన్నికల నుంచి రాజకీయ వైరం ఉన్నప్పటికీ.. ఈ వ్యాఖ్యలు ఇద్దరి మధ్య సహకారం ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఈ వైరం ఎన్నికల ప్రచారం సమయంలో డొనాల్డ్ ట్రంప్, పుతిన్ లాంటి నాయకులను ప్రశంసించగా.. ఆ విషయంలో క్లింటన్ విమర్శించడంతో ఇది మొదలైంది.
ట్రంప్-పుతిన్ కీలక భేటీ
అలస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం తర్వాత డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరూ తమ చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఈ చర్చల ద్వారా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు దగ్గరగా వస్తోందని ట్రంప్ అన్నారు. అయితే తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించలేదు. ట్రంప్ మాట్లాడుతూ..ఈ సమావేశం చాలా బాగా జరిగిందని చెప్పారు. వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సమావేశం నిర్మాణాత్మకంగా, గౌరవప్రదంగా ఉందని అన్నారు.
శాంతికి సవాళ్లు
ట్రంప్-పుతిన్ సమావేశం తర్వాత కూడా శాంతి స్థాపన అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా ఈ యుద్ధం ముగియాలంటే ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలపై తమకు హక్కు ఉందని, అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతోంది. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ, తమ భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా రష్యాకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇది శాంతి చర్చలకు ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో హిల్లరీ క్లింటన్ పెట్టిన షరతును ట్రంప్ నెరవేర్చగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications