వామ్మో యమ డేంజర్: కొబ్బరి నూనె విషమట..బాంబు పేల్చిన హార్వర్డ్ ప్రొఫెసర్
కొబ్బరి నూనె... తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తలకు రాసుకుంటారు... కేరళలో మాత్రం వంటనూనెలా వాడుతారు. కొందరు కొబ్బెర నూనె తాగితే పలు వ్యాధులు నయమవుతాయని చెబుతుంటారు. కొబ్బెర నూనెతో ఎన్నో లాభాలు ఉంటాయని చాలామంది చెప్పడం విన్నాము. ఇక యూట్యూబ్‌లో కోకోనట్ అని టైప్ చేస్తే చాలు... దానికి సంబంధించినవి బోలెడు వీడియోలు వస్తాయి. కొబ్బరి నూనె తాగడం వల్ల ఏకంగా బరువే తగ్గుతారని వీరమాచినేని అనే పెద్దాయన సెలవిచ్చారు. దీంతో ఆయన ప్రతిపాదించిన హెల్త్ డైట్‌కు బీభత్సమైన ఫ్యాన్స్ తయారయ్యారు. ఇప్పుడు కొబ్బరి నూనె గురించి కఠోరమైన వాస్తవాన్ని బయటపెట్టి అదంటేనే విరక్తి కలిగేలా చేశారు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ కరీన్ మిషెల్స్.
హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కెరిన్ మిషెల్స్ కొబ్బరి నూనె స్వచ్ఛమైన విషమంటూ చెప్పి బాంబు పేల్చారు. కొబ్బరి నూనె అనేది వంటల్లో వినియోగిస్తే కోరి కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్లేనని చెప్పారు.కొబ్బరి నూనె శుద్ధి చేసిన విషం అని ఆమె తెలిపారు.కొందరు కొబ్బరి నూనె నేరుగా తాగుతుంటారని అయితే అత్యంత ప్రమాదకరమని కెరిన్ స్పష్టం చేశారు. కోకనట్ ఆయిల్ అండ్ అదర్ న్యూట్రిషనల్ ఎర్రర్స్ పై కెరిన్ లెక్చర్ ఇచ్చారు. ప్రస్తుతం కెరిన్ ఇచ్చిన లెక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు.

కొబ్బరి నూనెలో ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలుంటాయని చెప్పిన కెరిన్... శరీరంలోని ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను ఈ కొబ్బరి నూనె పెంచుతుందని తద్వారా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని చెప్పారు. కొబ్బరినూనెలో 80శాతం కొవ్వు ఉంటుందని..ఇది పంది మాంసంలోని కొవ్వు కంటే రెండింతలుండగా... బీఫ్‌లో ఉండే కొవ్వుకంటే 60శాతం అధికంగా ఉంటుందని వివరించారు. గతేడాది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనే సంస్థ వంటల్లో కొబ్బరి నూనె వినియోగంపై సర్వే చేసింది. ఇందులో పావువంతు అమెరికన్లు కొబ్బరి నూనె ఆరోగ్యకరమైనదే అని చెప్పగా... ఈ స్టేట్‌మెంట్‌తో 37శాతం మంది న్యూట్రిషన్లే ఏకీభవించారు.
వంటల్లో కొబ్బరినూనె వినియోగం ఎంత తక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని పలు ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయపరమైన రుజువు లేదని బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ చెప్పుకొచ్చింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications