మంచి పోస్ట్‌లో ఉండి జల్సాల కోసం 5 కోట్లు కొట్టేసింది

లండన్: 43 ఏళ్ల జూలియా హోగ్ అనే మహిళ లీడ్స్ సిటీ కాలేజీలో కాలేజీ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తోంది. ఆమె తన విలాసవంతమైన జీవన శైలికి అలవాటుపడింది. లావిష్ లైఫ్‌స్టయిల్‌కు అలవాటు పడి కష్టాలు తెచ్చుకుంది.

వచ్చే జీతం తక్కువ కావడంతో ఏకంగా విద్యార్థుల కోసం వచ్చించవలసిన నిధులను తీసుకొని, ఆ నిధులను తన భర్త, స్నేహితులతో పాటు బంధువుల కోసం నీళ్లలా ఖర్చు చేసింది. విద్యార్థులకు చెందిన 500,000 పౌండ్లను ఆమె తీసుకుంది. ఇది మన కరెన్సీలో దాదాపు ఐదు కోట్లు.

College administrator stole £500,000 of student grants to 'buy friends' with lavish lifestyle

గత ఏడాది అక్టోబరు నెలలో లీడ్స్ సిటీ కాలేజీలో జరిగిన ఆడిటింగులో నిధులు భారీగా మళ్లిన విషయాన్ని గుర్తించారు. చిన్నారుల కోసం విదేశాల నుంచి వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉంటాయి. అయితే వాటిని జూలియా తన సొంత బ్యాంకు అకౌంటుకు తరలించుకుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల విచారణలో ఆమె తన తప్పును అంగీకరించింది. జూలియాకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె ఉద్యోగంలో చేరే నాటి నుంచి గత ఏడాది వరకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లుగా గుర్తించారు. ఆమె 2009లో లీడ్స్ సిటీ కాలేజీలో అడ్మినిస్ట్రేటర్‌గా చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+