ప్రేమించుకోండి- పిల్లల్ని కనండి: స్టూడెంట్స్‌కు సెలవ్ కూడా: చైనా వింత నిర్ణయం
బీజింగ్: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అంటే చైనా అనే సమాధానమే వినిపిస్తుంది. దశాబ్దాలుగా అత్యధిక జనాభాతో సతమతమౌతోందా దేశం. దీనివల్ల అనేక సమస్యలను ఎదుర్కొంది. వాటిని అధిగమించడానికి జననాల నియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. సుదీర్ఘకాలంగా ఈ బర్త్ కంట్రోల్ అక్కడ కొనసాగుతూ వస్తోంది. ఫలితంగా జననాల రేటు అనూహ్యంగా దిగజారింది. యువత కంటే వయోధిక వృద్ధుల సంఖ్య చైనాలో అధికంగా నమోదవుతోంది.
2050 నాటికి చైనా జనాభా 109 మిలియన్లకు తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది చైనా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సీనియర్ సిటిజన్ల సంఖ్య భారీగా పెరుగుతోండటం వల్ల భవిష్యత్తులో చైనా వయోధిక వృద్ధ దేశంగా ఆవిర్భవిస్తుందనే ఆందోళన చైనాలో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో- ఎక్కువ మంది పిల్లలను కనే వారిని ప్రోత్సహించడానికి పన్ను తగ్గింపులు సైతం చేపట్టింది. ప్రసూతి సెలవులను పొడిగించింది.

ఆర్థిక రాయితీలతో సహా పలు ప్రోత్సాహకాలను అందించడానికి చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జపాన్, దక్షిణ కొరియాతో సహా కొన్ని ఆసియా దేశాలలో కూడా జనన రేటు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో- చైనా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జననాల రేటును పెంచడానికి ఎవరూ ఊహించని విధంగా ఆదేశాలను జారీ చేసిందక్కడి విద్యా మంత్రిత్వ శాఖ. ప్రేమించుకోవడానికి సెలవును ప్రకటించింది. ఏకంగా వారం రోజుల పాటు సెలవు ఇచ్చింది. ప్రస్తుతం చైనాలో వసంత కాలం.
ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ సూచించింది. ఈ స్ప్రింగ్ సీజన్‌లో వెళ్లి ప్రేమలో పడాలని, జంటగా కలిసి ఉండాలని పేర్కొంది. ఇది టీచర్లకు కూడా వర్తిస్తుంది. ఈ మేరకు చైనాలోని తొమ్మిది ఒకేషనల్ కాలేజీలు నోటిఫికేషన్‌ను జారీ చేశాయి. విద్యార్థులు ప్రకృతిని, జీవితాన్ని ప్రేమించడం, ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థినీ విద్యార్థులకు ఈ స్ప్రింగ్ బ్రేక్‌ను ఇచ్చినట్లు మియాంగ్ ఏవియేషన్ ఒకేషనల్ కళాశాల డిప్యూటీ డీన్ లియాంగ్ గువోహుయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థుల ఆలోచనా పరిధి, వారిలో స్వతంత్ర భావాలను మరింత విస్తృతం చేయడానికి తాము తీసుకున్న ఈ చర్య ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థినీ, విద్యార్థుల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించడానికి స్ప్రింగ్ సీజన్ కంటే మంచి కాలం ఉండదని చైనా నైరుతి ప్రాంతంలోని సిచువాన్‌లో గల సౌత్ వెస్ట్ ఏవియేషన్ ఒకేషనల్ కాలేజ్ డిప్యూటీ డీన్ లియు పింగ్ వ్యాఖ్యానించారు. స్టూడెంట్స్ మధ్య కొత్త స్నేహాలు పుట్టుకొస్తాయిని,












Click it and Unblock the Notifications