కూలిన హెలికాప్టర్: 16మంది మృతి(వీడియో)
బోగోటా: కొలంబియాలోని బోగోటా ప్రాంతంలో బ్లాక్‌హాక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 16మంది అధికారులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 17మంది అధికారులు ఉన్నారు.
వీరు కొలంబియాలోని ఉసుగ డ్రగ్ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, కొలంబియా రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ. వాతావరణం అనుకూలించకపోవడం, పొగ మేఘాలు కమ్ముకోవడంతో ఏదైనా కొండను ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, డ్రగ్ ముఠానే హెలికాప్టర్‌ను పేల్చివేసిందంటూ ప్రచారం కొనసాగుతోంది. అయితే, అక్కడి స్థానికులు మాత్రం హెలికాప్టర్లపై ఎలాంటి కాల్పులు జరగలేదని చెబుతున్నారు.
బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ మోసం
సిడ్నీ: బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వద్ద నుంచి ఎనిమిది నకిలీ బంగారపు లాఫింగ్ బుద్ధ విగ్రహాలు, దాదాపు 100 నకిలీ బంగారపు కడ్డీలు, ఐదు మొబైల్ ఫోన్లు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీతోపాటు నకిలీ పాస్ పోర్ట్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
ఈ మేరకు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. బంగారపు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని స్థానికంగా నివసిస్తున్న ఓ మహిళ అధికంగా సొమ్ము వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఆ బొమ్మ రాగితో తయారు చేసి... బంగారం పూత పూసిన నకిలీదని గుర్తించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications