ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కుకుటా నుంచి బయలుదేరిన సటేనా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ 1900 విమానం, వెనిజులా సరిహద్దు సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 15 మంది(13 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది) మరణించినట్లు ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ సటేనా ధ్రువీకరించింది.
అసలేం జరిగిందంటే?
సటేనా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ 1900 విమానం బుధవారం ఉదయం కుకూటా నగరం నుంచి బయలుదేరింది. వెనిజులా సరిహద్దుకు సమీపంలోని ఒకాన్యా నగరంలో మధ్యాహ్నం 12:05 గంటలకు ఇది ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ల్యాండింగ్‌కు కేవలం 11 నిమిషాల ముందు విమానం నుంచి సిగ్నల్ కట్ అయ్యిందని అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టగా, ఒకాన్యా సమీపంలోని ఎత్తైన పర్వత ప్రాంతంలో విమానం శిథిలాలను గుర్తించారు. ఈ ప్రాంతం కొలంబియాలోని తిరుగుబాటు గ్రూపుల నియంత్రణలో ఉండటంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి.

ప్రముఖుల మృతి
మరణించిన వారిలో కొలంబియాకు చెందిన ఇద్దరు కీలక రాజకీయ నేతలు ఉన్నట్లు అధికారిక జాబితా ద్వారా తెలిసింది. కొలంబియా పార్లమెంట్ సభ్యుడైన డియోజెనెస్ క్వింటెరో అమాయ ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అంతర్గత యుద్ధ బాధితుల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 16 మంది ఎంపీలలో ఈయన ఒకరు.త్వరలో జరగనున్న నేషనల్ కాంగ్రెస్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్లోస్ సాల్సెడో కూడా ఈ ప్రమాదంలో మరణించారు.
🚨 Colombia plane crash kills all 15 on board — reports
— Sputnik (@SputnikInt) January 28, 2026
A Beechcraft 1900 crashed in northern Colombia after losing contact near Ocaña, close to the Venezuelan border. The wreckage was found in a mountainous area, BBC reported, citing state-run airline Satena.
Footage from… pic.twitter.com/8RskY0049F
స్పందించిన కొలంబియా అధ్యక్షుడు
ఈ ప్రమాదంపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. "ఈ మరణాలు నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నాయి" అని ఆయన రాశారు. నార్త్ శాంటాండర్ గవర్నర్ విలియం విల్లామిజార్ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికితీశారు. మృతుల బంధువుల కోసం ప్రత్యేక హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications