సెక్సీ అమ్మాయే కానీ..14హత్యలు చేసింది!
బొగోటా: ఆమె ఓ అందమైన యువతి. ఆమె వయస్సు 22 ఏళ్లు. చేసింది మాత్రం 14 హత్యలు. డ్రగ్ మాఫియా ముఠాతో కలిసి ఆమె సాగించిన ఈ నరమేధంతో కటకటాలపాలైంది. ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆమెను ఆ దేశంలో దెయ్యం మహిళగా పేర్కొంటుండటం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. కొలంబియా పోలీసులు యూరీ పాట్రీసియా సాంఛెజ్(22) అనే కరుడుగట్టిన మహిళా కాంట్రాక్ట్ కిల్లర్‌ను ఇటీవల అరెస్ట్ చేశారు. ఏడుగురు పోలీసులతో సహా మొత్తం 14 మందిని ఆమె హతమార్చినట్లు అభియోగాలున్నాయి.

కొలంబియాలో అత్యంత ప్రమాదకర మహిళ(దెయ్యం మహిళ)గా పేరున్న సాంఛెజ్.. ఓ డ్రగ్ ట్రాఫికింగ్ ముఠాతో కలిసి పనిచేస్తోంది. పైకి అందంగా కనిపించే ఈ కిలేడీ నేరచరిత్రను చూసి పోలీసులకే దిమ్మదిరిగిపోయింది.
కొలంబియాలోని పవర్ ఫుల్ డ్రగ్ ట్రాఫికింగ్ ముఠా 'ఉసేగా'లో సాంఛెజ్ క్రీయాశీలక సభ్యురాలని పోలీసులు గుర్తించారు. ఉసేగా ముఠా ఒక్క కొలంబియాలోనే కాకుండా పెరూ, అర్జెంటీనా, బ్రెజిల్, హోండురస్‌లలో సైతం తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
సాంఛెజ్‌కు ప్రమేయమున్న హత్యల జాబితాకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. దీనిలో ఓ పోలీసు అధికారి.. హత్యల వివరాలను ఒకదాని తరువాత ఒకటి 14 హత్యల గురించి చదువుకుంటూ పోవడం కనిపిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పలు ముఠాలకు సంబంధించిన కీలక సమాచారం సాంచెజ్‌కు తెలుసునని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడిచారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications