ట్రంప్ గప్ చుప్: బైడెన్‌కు అధికార బదిలీపై వీపీ మైక్ పెన్స్ కీలక ప్రకటన -Inauguration సాఫీగా

అమెరికా చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్ గా విమర్శలు ఎదుర్కొంటూ, ఇంకొద్ది రోజుల్లో గద్దె దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్.. కేపిటల్ భవంతి ఘటన తర్వాత ఆల్మోస్ట్ నోటికి తాళాలేసుకున్నారు. ఒకటిరెండు ముఖ్యాంశాలు తప్ప ఇంత విషయాలన్నింటినీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ డీల్ చేస్తున్నారు. ఈనెల 20న అదే కేపిటల్ భవంతి ఎదుట జరుగనున్న కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం, అధికార బాధ్యతల బదిలీ తదితర అంశాలపై వీపీ పేన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేపిటల్ భవంతిపై దాడికి పాల్పడిన ట్రంప్ అనుచరులు... కొత్త ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రమాణస్వీకారాన్ని కూడా అడ్డుకోవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో అమెరికా రాజధాని వాషిగ్టన్ డీసీలో ఎమర్జెన్సీ విధించారు. ప్రస్తుతం కేపిటల్ భవంతి సహా డీసీలోకి కీలక ప్రాంతాల్లో భద్రతపై ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌ఈఎంఏ)తో వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు.

 Committed to orderly transfer of power, safe Inauguration:US VP Mike Pence

ఎఫ్ఈఎంఏతో భేటీ సందర్భంగా మైక్ పెన్స్ మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌కు పద్ధతి ప్రకారం అధికార బాధ్యతలను అప్పగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సంప్రదాయబద్ధంగా బాధ్యతలను అప్పగించడం ద్వారా అమెరికన్లకు గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకార మహోత్సవం సురక్షితంగా జరిగేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

 Committed to orderly transfer of power, safe Inauguration:US VP Mike Pence

నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌పై బైడెన్ ఘన విజయం సాధించారు. ఈనెల 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా నిరసనలు, అల్లర్లకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తమకు నివేదికలు అందాయని ఎఫ్‌బీఐ ప్రకటించింది. కాగా.. జనవరి 6న జరిగిన కేపిటల్ ఘటన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 7000 మంది నేషనల్ గార్డ్స్ వాషింగ్టన్ నగరంలో మోహరించారు. మరో 20వేల మంది భద్రతా దళాలు సిటీలో పహారా కాయనున్నాయి.

 Committed to orderly transfer of power, safe Inauguration:US VP Mike Pence
'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+