వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగిన గర్భిణీపై బాస్ కర్కశత్వం.. కట్ చేస్తే..?
సాధారణంగా టెక్ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సహజం. కొవిడ్-19 తర్వాత చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. అయితే ఏదైనా అనారోగ్య సమస్యలు, ఇతర ముఖ్యమైన కారణాలు ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ తీసుకుంటారు ఉద్యోగులు. కానీ యూకే లండన్ లోని ఓ కంపెనీలో పనిచేసే ఓ మహిళ గర్భిణీ కావడంతో ఆఫీస్ కు రాలేక వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగింది. అయితే బాస్ ఆమెకు కఠిన శిక్ష వేశాడు.
ఏం జరిగింది..?
యూకే బర్మింగ్ హామ్ లోని రోమన్ ప్రాపర్టీ గ్రూప్ సంస్థల్లో పౌలా మిలుస్కా అనే ఉద్యోగి పనిచేస్తున్నారు. ఇన్ వెస్ట్ మెంట్ కన్సల్టెంట్ గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఓ రోజు ఉదయం కాస్త అనారోగ్యంగా అనిపించింది. దీంతో తన బాస్ అమ్మార్ కబీర్ కు ఫోన్ చేసి.. వర్క్ ఫ్రమ్ హోం కావాలని.. ఆఫీస్ కు రాలేక పోతున్నానని చెప్పారు. కానీ వర్క్ లోడ్ వల్ల తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం కుదరదని.. వేరొకరిని నియమిస్తామని చెప్పారు. ఆమె ఆఫీస్ కు రాలేకపోవడంతో ఆమెను ఫైర్ చేశారు.

మిలుస్కా మార్చి 2022లో జాబ్ లో జాయిన్ అయ్యారు. అక్టోబర్ నాటికి ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. డాక్టర్లు ఆమెను రెస్ట్ తీసుకోమన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బెటర్ అని సలహా ఇచ్చారు. వైద్యుల సలహా మేరకు ఆమె కంపెనీ యాజమాన్యాన్ని వర్క్ ఫ్రమ్ హోం అడిగారు. కానీ వాళ్లు మిలుస్కాను జాబ్ నుంచి తీసేశారు. దీంతో ఆమె ఎంప్లాయ్ మెంట్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తనను ఎలాంటి కారణం లేకుండా తీసేశారని మిలుస్కా కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఎంప్లాయ్ మెంట్ కోర్టు జడ్జి గ్యారీ స్మార్ట్.. కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆమెకు తక్షణమే రూ. కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications