కరోనా పూర్తిగా అంతం అప్పుడే..? మాస్క్ కూడా అవసరం లేదు..
కరోనా కేసులు తగ్గుతున్నా.., పూర్వ పరిస్థితి లేదు. కానీ ఆ రోజులు కొద్దీ రోజుల్లోనే రానుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ గ్లోబల్ హెల్త్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం కోవిడ్‌ను కచ్చితంగా నిర్మూలించవచ్చునని అంటున్నారు. కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్లను వాడుకోవడం.. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేయడం.. ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవడం.. కరోనా నియంత్రణ చర్యలను ప్రజలు అర్థం చేసుకోవడం.. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకోవడం అని అధ్యయనం చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా సంక్రమణను సున్నాకి తీసుకుని రావచ్చునని.. SARS-CoV-2 నిర్మూలన సాధ్యమేనా అనే విషయాన్ని నిర్వచించారు. ఉద్దేశపూర్వక ప్రయత్నాల ఫలితంగా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం.. ప్రపంచవ్యాప్త కరోనా సంక్రమణ సున్నాకి శాశ్వతంగా తీసుకునిరావడానికి ఈ ప్రణాళిక సాయపడుతుంది. గతంలో మశూచికి, పోలియోవైరస్ కూడా ఇదే రకమైన మార్గాన్ని అనుసరించారు. COVID-19 వైరస్‌ను మశూచి, పోలియోతో పోల్చారు. మశూచి నిర్మూలన కంటే కోవిడ్‌ని వదిలించుకోవడం చాలా కష్టం, కానీ పోలియోను వదిలించుకోవడం కంటే సులభం అని వెల్లడించారు.

కోవిడ్ నిర్మూలనకు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం ముఖ్యం అని విశ్లేషణలో నిపుణులు చెబుతున్నారు. సామాజిక అవగాహన లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇది అంత సులభమైన పని కాదు కానీ వందల వేల మంది ప్రాణాలను కాపాడేందుకు మాత్రం లక్షలాది మందికి కోవిడ్ సోకకుండా ఉండేందుకు మాత్రం ఇది ముఖ్యం అని అధ్యయనం చెబుతుంది. టెక్నికల్‌గా COVID-19 నిర్మూలనకు చాలా కష్టపడాల్సి ఉందని, వ్యాక్సిన్ వేయించుకోవడం, రోగనిరోధకను పెంచుకోవడం, ముందస్తుగా ఖర్చు పెట్టి, వ్యాక్సిన్ మరియు ఆరోగ్య వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతోంది అధ్యయనం.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.
Recommended Video
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications