అసభ్యకర దుస్తులు: నిలదీసిన ప్రియుడిని కత్తితో పొడిచి చంపింది
లాంకషైర్: 19 ఏళ్ల ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్‌ను కత్తితో పొడిచింది. తాను వేసుకున్న దుస్తులు తదితర విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఆమె ఓ కత్తితో బాయ్ ఫ్రెండ్‌ను పొడిచి చంపింది. ఈ సంఘటన లాంకషైర్‌లో జరిగింది.
పందొమ్మిదేళ్ల యువతి సారా విల్లిస్ ముస్లీం మతంలోకి మారింది. ఆమెకు బిలాల్ సిద్దిఖీ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బిలాల్ సిద్దిఖీ ముస్లీం పద్ధతుల ఆచరణ పట్ల చాలా సీరియస్‌గా ఉంటాడు. అయితే, సారా విల్లిస్‌తో తన సంబంధాన్ని కొనసాగించాడు.

ఓ దశలో ఇద్దరి మధ్య వాదన జరిగింది. సారా విల్లిస్ వేసుకుంటున్న టైట్ దుస్తులు, షార్ట్ దుస్తుల పైన ప్రియుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఓ సమయంలో ఆమెను మరో యువకుడితో చూశాడు. ఈ సంఘటనలు సిద్ధికి ఏమాత్రం రుచించలేదు.
దీంతో తనను చీటింగ్ చేస్తోందని సిద్ధిఖి అనుమానించాడు. ఆమెను నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో సారా విల్లిస్ పక్కనే ఉన్న ఓ చాకును తీసుకొని బిలాల్‌ను పొడిచింది. అతనికి తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ గంట తర్వాత మృతి చెందాడు. సారా విల్లిస్ పైన హత్య కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications