కరోనా: మందు ప్రియులకు చేదువార్త.. బీర్ ప్రొడక్షన్ కూడా బంద్, ఈ నెల 30 వరకు..
బీర్ ప్రియులకు చేదు వార్త. బీర్లలో కరోనా బ్రాండ్ వాడే మందుప్రియుల నోటిలో వెలక్కాయ పడే వార్తను కంపెనీ ప్రకటించింది. మెక్సికోలో క్రమంగా కరోనా బీర్ ఉత్పత్తిని తగ్గిస్తున్నామని తెలిపింది. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. 1500 మందికి వైరస్ సోకగా.. 50 మంది చనిపోయారు. మెక్సికో ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా బీర్ ఉత్పత్తి తగ్గిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఏప్రిల్ 30 వరకు..
ఫసిఫిక్, మెడెలో బ్రాండ్లు ఉన్న గ్రూపో మోడెలో కంపెనీ మెక్సికోలో కరోనా బీర్లను తయారు చేస్తోంది. దేశంలో వైరస్ వేగంగా ప్రబలుతోన్న నేపథ్యంలో బీర్ ఉత్పత్తి నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించంతో నిలిపివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు ఉత్పత్తి నిలిచిపోతుందని స్పష్టంచేసింది. ఇప్పటికే ఫ్యాక్టరీలో ఉత్పత్తిని క్రమంగా తగ్గించామని.. దానిని కనీస స్థాయికి తగ్గించే పనిలో ఉన్నామని పేర్కొన్నది.

ఇతర కంపెనీలు కూడా..
దేశంలో పరిస్థితి దృష్ట్యా.. వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని మెక్సికో ప్రభుత్వం పేర్కొన్నది. ఇతర ఉత్పత్తులపై మాత్రం ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రభుత్వం తమకు పర్మిషన్ ఇస్తే 75 శాతం సిబ్బందితో పూర్తి ఉత్పత్తి చేసేందుకు సిద్దమని కంపెనీ తెలిపింది. కరోనా కాదు హీనెకెన్ కూడా తమ బీర్ల ఉత్పత్తిని ఆపివేసిందని స్థానిక పత్రిక పేర్కొన్నది. బీర్ల ఉత్పత్తిని నిలిపివేయడంపై ఆయా కంపెనీలు తప్పుపట్టాయి.

40 శాతం తగ్గిన విక్రయాలు..
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బీర్‌పై బోకులు పేలాయి. మీమ్స్ కూడా వచ్చాయి. ఇతర పుకార్లతో అమెరికాలో కరోనా బీర్ల విక్రయాలు 40 శాతం మేర తగ్గాయి. కానీ ఫిబ్రవరిలో తమ కంపెనీపై వస్తోన్న పుకార్లను ఖండించింది. ఇతర చోట్ల కరోనా బీర్లపై ప్రభావం చూపినా.. అమెరికాలో మాత్రం సేల్ అవుతున్నాయని కంపెనీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications