వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: 213 మంది ఉసురు తీసిన వైరస్: 9692 కేసులు: మరింత విషమం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Coronavirus : China Reports 9,692 Confirmed Cases Of Corona, 213 Is No More !

బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ మరింత ముదిరింది. రోజులు గడుస్తున్న కొద్దీ తన పరిధిని పెంచుకుంటోంది. జనం ఉసురు తీస్తోంది. చైనాలో ఈ వైరస్ అత్యంత భయానక పరిస్థితులకు కారణమైంది. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య చైనాలో మొన్నటిదాకా 170 వరకు ఉండగా..ఒక్క రోజు తేడాలో 213కు చేరిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనాలోని దాదాపు అన్ని ప్రావిన్స్‌ల్లోనూ కరోనా వైరస్ జాడ లభించాయి.

Coronavirus: చైనాలో మరణమృందంగం: 7700 మందికి సోకిన వైరస్: 170 మంది మృతి: రోజురోజుకూ..!Coronavirus: చైనాలో మరణమృందంగం: 7700 మందికి సోకిన వైరస్: 170 మంది మృతి: రోజురోజుకూ..!

గంటకు ఇద్దరి మృతి

గంటకు ఇద్దరి మృతి

గురువారం నాటికి 9692 కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. వైరస్ సోకిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 43 మరణాలు సంభవించాయని, 1982 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్ పరిధి పెరగటం ఆందోళన కలిగిస్తున్నట్లు ఆరోగ్య కమిషనర్ అధికారులు చెప్పారు. దీన్ని నియంత్రించడానికి అందుబాటులో ఎలాంటి మార్గాలు కనిపించట్లేదని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తున్నామని అన్నారు.

హ్యూబే ప్రావిన్స్‌లోనే

హ్యూబే ప్రావిన్స్‌లోనే

గురువారం ఒక్కరోజులోనే హ్యూబే ప్రావిన్స్‌లో 42 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరొకరు చెంగ్డు ప్రావిన్స్‌లో మృతిచెందినట్లు చెప్పారు. దీనితో హ్యూబే ప్రావిన్స్‌లో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 201కి చేరింది. రాజధాని బీజింగ్, ఆర్థిక రాజధాని షాంఘై సహా, చోంగ్‌క్వింగ్, అన్హుయ్, ఫుజియన్, గ్వాంగ్‌డాంగ్, జియాంగ్షు, జియాంగ్ఝి, యున్నాన్ వంటి ప్రావిన్స్‌లల్లో కరోనా కేసులో పెద్ద సంఖ్యలో నమోదైనట్లు చెప్పారు.

ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించిన అమెరికా..

ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించిన అమెరికా..

అమెరికా ప్రభుత్వం తాజాగా ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించింది. చైనాకు రాకపోకలు సాగించదలిచిన అమెరికన్లు.. తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని, లేదా వాయిదా వేసుకోవాలని సూచించింది. చైనాలో కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోల ఎవరూ ఆ దేశానికి వెళ్లొద్దని వెల్లడించింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాతే.. చైనాకు వెళ్లేలా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొంది.

English summary
China’s National Health Commission (NHC) said on Friday the death toll from the coronavirus outbreak in the country rose to 213 as of end-Thursday, with another 1,982 new cases confirmed. The total number of confirmed coronavirus cases in China reached 9,692 as of end-Thursday, NHC said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X