Coronavirus:చాలా ప్రాణాంతక వైరస్‌లకు కారణం గబ్బిలాలే..! తప్పక చదవండి

వూహాన్/చైనా: చైనాను కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారీ బారిన పడి 170 మంది మృతి చెందారు. చైనాలోని వూహాన్ ప్రావిన్స్‌లో బయటపడ్డ ఈ వైరస్... ప్రస్తుతం ప్రపంచదేశాలకు క్రమంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ కేసులు క్రమంగా బయట పడుతుండటంతో ఆయా దేశాలు అక్కడి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్‌ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఏ జంతువుల కారణంగా మనిషి మృత్యువాత పడుతున్నాడు..?

వైరస్ జన్యుక్రమం పరిశీలిస్తే...

వైరస్ జన్యుక్రమం పరిశీలిస్తే...


ఎప్పుడూ యుద్ధాలతో బెంబేలెత్తిపోయే ప్రపంచ దేశాలు ఇప్పుడు కరోనా వైరస్‌తో వణుకుతున్నాయి. ఒకరికి సోకిందంటే చాలు పక్కనున్న వారు కూడా బలవుతున్నారు. అంత తొందరగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఈ వ్యాధి మూలాలు ఒక పాము నుంచి వచ్చాయని ముందుగా శాస్త్రవేత్తలు భావించినప్పటికీ... అసలు కారణం మాత్రం గబ్బిలాలే అని తేల్చారు అంటువ్యాధి నిపుణులు. వైరస్ జన్యు క్రమాన్ని పరిశీలించి... కరోనా వైరస్ సోకిన బాధితులను పరిశీలిస్తే ఇది గబ్బిలాల నుంచే వస్తుందన్న విషయం స్పష్టమవుతోందని ఎకో హెల్త్ అలయన్స్ అధ్యక్షుడు డాక్టర్ పీటర్ డసాక్. అంతేకాదు చైనాలోని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా కరోనా వైరస్‌కు మూలకారణం గబ్బిలాలే అని తేల్చింది. ఇక గబ్బిలం మానవజాతికి శాపంలా పరిణమించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 గబ్బిలాల నుంచే ఎబోలా, నిఫా, రేబీస్ వంటి వైరస్‌లు

గబ్బిలాల నుంచే ఎబోలా, నిఫా, రేబీస్ వంటి వైరస్‌లు


కరోనా వైరస్‌కు ప్రధాన కారణం గబ్బిలం అన్న సంగతి అటుంచితే.. ఈ గబ్బిలం వల్ల ఇతర వైరస్‌లు కూడా వచ్చాయి. మార్బర్గ్, నిఫా, హెండ్రా లాంటి ప్రమాదకరమైన వైరస్‌లు కూడా గబ్బిలం నుంచే వచ్చాయి. ఈ తరహా వైరస్‌ కేసులు ఉగాండా, మలేషియా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలో నమోదయ్యాయి. ఇక ప్రపంచాన్ని గడగడలాడించి ఎబోలా వైరస్, రేబీస్, సార్స్ ,మెర్స్ వైరస్‌లు కూడా గబ్బిలం నుంచి వచ్చినవే అని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌లు జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశిస్తున్నందున శాస్త్రవేత్తలు వీటిని జూనోటిక్ వ్యాధులుగా పిలుస్తున్నారు.

తాటి చెట్లపై వాలిన గబ్బిలాల ద్వారా..

తాటి చెట్లపై వాలిన గబ్బిలాల ద్వారా..

నిఫా వైరస్‌తో మెదడు దెబ్బ తింటుంది. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పరిశోధనలు చేయగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఖర్జూరపు లేదా తాటి చెట్లపై వాలిన గబ్బిలాలు మూత్ర విసర్జన చేయడం, లేదా వాటి నుంచి విడుదలైన లాలాజలంతో ఆ చెట్టు కలుషితమయ్యేదని దాని నుంచి సేకరించిన జ్యూస్ తాగడంతో నిఫా వైరస్ సోకిందని చెప్పారు. గబ్బిలాల నుంచి వచ్చే వైరస్‌లపై వైరాలజిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనావైరస్‌కు మూలకారణం గబ్బిలమే అని తేల్చేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1300 జాతుల గబ్బిలాలున్నాయి. ఒక్క అంటార్క్‌టికా తప్ప అన్ని ఖండాల్లో ఇవి నివసిస్తున్నాయి.

గబ్బిలాల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ

గబ్బిలాల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ

గబ్బిలాలు నిత్యం ఎగురుతుండటం వల్ల వాటి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఓక థియరీ చెబుతోంది. నిత్యం ఎగురుతుండటం వల్ల దాని శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని ఆ సమయంలో వాటికి వైరస్ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇక గబ్బిలం ఒక్కటే ప్రమాదకర వైరస్‌లకు కారణం కాదు. కొన్ని ఎలుకల నుంచి లేదా చింపాజీల నుంచి కూడా మనుషులకు ప్రమాదకర వైరస్‌లు సోకే అవకాశం ఉంది. 2017లో శాస్త్రవేత్తలు విడుదల చేసిన పేపర్లో ఇతర జంతువుల కంటే కూడా గబ్బిలాలు అత్యంత ప్రమాదకరమని తేల్చారు. అడవులు అంతరించిపోతుండటం, అర్బనైజేషన్ అవుతుండటం, చైనాలాంటి అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఈ వైరస్‌లో సులభంగా వ్యాప్తి చెందుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Recommended Video

    Coronavirus : Do's And Don'ts For Prevention Of Coronavirus !
     గతేడాదే కరోనా వైరస్‌ గురించి హెచ్చరించిన పరిశోధకులు

    గతేడాదే కరోనా వైరస్‌ గురించి హెచ్చరించిన పరిశోధకులు


    మూహార్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీ గతేడాదే పరిశోధనలు చేసి ప్రపంచాన్ని ఓ ప్రాణాంతక వైరస్ వణికించబోతోందని చెప్పారు. అదే కరోనా వైరస్ అని చెప్పిన పరిశోధకులు చైనా ఇందుకు కేంద్రంగా మారుతుందని అప్పుడే హెచ్చరించారు. అయితే ఇలాంటి వైరస్ ఎప్పుడు ఎక్కడ వస్తుందనేదే సవాలుగా మారుతోందని గతేడాది శాస్త్రవేత్తలు చెప్పారు. అది తెలిస్తే వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టగలమని చెప్పారు. చైనాలో ఉన్న గబ్బిలాల నుంచే ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ గబ్బిలాలు ఆగ్నేసియా వ్యాప్తంగా ఉ్ననాయని చెప్పారు. ప్రజలకు ఈ వైరస్ అత్యంత సులభంగా సోకుతుందని చెప్పారు.

     గబ్బిలాలతో పాటు పాముల్లో కూడా కరోనా వైరస్

    గబ్బిలాలతో పాటు పాముల్లో కూడా కరోనా వైరస్

    వూహాన్ మార్కెట్‌లో ముందుగా కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. అయితే దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా గబ్బిలం నుంచి మరో జంతువుకు సోకి అక్కడి నుంచి మనుషులకు సోకుతోందని చైనాలోని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ చెబుతోంది. ఇక వైరస్‌ గబ్బిలంతో పాటు పాముల్లో కూడా గుర్తించడం జరిగిందని పాల్ హంటర్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. గబ్బిలం, పాములు మనుషుల్లో ఒకే రకంగా ఈ వైరస్ ఆనవాలు ఉన్నట్లు గుర్తించినట్లు హంటర్ చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+