మెట్రో రైలులో శృంగారం, ఆన్‌లైన్లో ఫోటోలు..
మాస్కో: ఓ జంట మెట్రో రైలు టన్నెల్‌లో శృంగారం జరపడమే కాకుండా, వాటిని ఆన్ లైన్లో పోస్టు చేసింది. దీంతో మెట్రో అధికారులు సోదాలు నిర్వహించారు. మాస్కో మెట్రో అధికారులు శుక్రవారం మాట్లాడుతూ.. ఓ జంట మెట్రో టెన్నెల్‌లో శృంగారంలో పాల్గొన్న నేపథ్యంలో అత్యవసర సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మాస్కోలో టన్నెల్స్ మెట్రో సర్వీస్ ఎక్కువగా ఉంటుంది. వీటిని డిగ్గర్స్ అంటారు. గత వారం ఓ జంట తాము మెట్రో టన్నెల్, రైలులో నగ్నంగా ఉన్న చిత్రాలను పోస్ట్ చేశారు. వారు వీటిని ఆన్ లైన్లో పోస్టు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

దీంతో స్థానిక మెట్రో భద్రత పైన ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు అత్యవసరంగా తనిఖీలు నిర్వహించారు. అండర్ గ్రౌండులోని మెట్రోలో ఇల్లీగల్‌గా ఏం చేయకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు తనిఖీలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications