చిప్స్ వేయించుకోవడానికి ఓవెన్ తెరవగానే మూడు అడుగుల పాము

మాంచెస్టర్: బ్రిటన్‌లో చిప్స్ తయారు చేసుకునేందుకు ఓవెన్ బయటకు తీయగా, అందులో మూడు అడుగుల పాములు కనిపించడంతో కంగు తిన్నారు. మాంచెస్టర్‍‌లోని ఓ వృద్ధ మహిళకు ఈ అనుభవం ఎదురైంది. ఆ తర్వాత తన భర్త ద్వారా జంతు సంరక్షణ అధికారులకు ఫోన్ చేసి కాపాడాలని కోరింది.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. తాను ఓవెన్ మూత తీయగానే షాకయ్యానని, ఈ మధ్యే తనకు కంటి ఆపరేషన్ జరిగిందని, నా కళ్లు ఏమన్నా మోసం అని పొరబడ్డానని, వెంటనే తన భర్తను పిలిచి చూపించానని, పాము నిజంగానే ఉందని ఆ మహిళ వెల్లడించారు.

Couple Opens Oven To Cook Chips, Finds 3 Foot Snake Inside

ఆ మహిళ గతంలోనే పాము కనిపించందని, జంతు సంరక్షణ బృందానికి సమాచారం అందించిందని, కానీ అప్పుడు వారు వచ్చి వెతికినా ఎక్కడా కనిపించలేదని, అది ఇప్పుడు ఓవెన్‌లో ప్రత్యక్షమైందని జంతు సంరక్షణ బృందంలోని వారు ఒకరు చెప్పారు.

ఆ పామును పట్టుకోగానే ఇన్‌స్పెక్టర్‌కు సదరు మహిళ ఆనందంగా హగ్ ఇచ్చింది. ఆ తర్వాత కాఫీ ఇచ్చింది. అయితే ఆ జాతి పాములు చాలా వేగంగా తప్పించుకు తిరుగుతాయని, విషపూరితమైనవి కావని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+