కారులో సెక్స్ చేస్తూ కన్నుమూసిన జంట..
రష్యా : కొత్తగా డేటింగ్ మొదలుపెట్టిన ఓ జంట కారులో సెక్స్ చేస్తూ కన్నుమూసిన సంఘటన రష్యాలో చోటు చేసుకుంది. బయటంతా గడ్డకట్టే చలి కావడంతో.. కారులో హీటర్స్ ఆన్ చేసుకుని రతికి ఉపక్రమించారు. అయితే కారు డోర్స్ మూసేసి హీటర్ ఆన్ చేయడంతో.. హీటర్స్ నుంచి అధిక స్థాయిలో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వారిద్దరిని బలిగొన్నట్టుగా రష్యన్ మీడియా వెల్లడించింది.
చనిపోయిన ఇద్దరిని ఆర్టమ్ ఎస్ (18), అన్నా డీ(20)గా గుర్తించారు పోలీసులు. చనిపోయిన సమయంలో ఇద్దరు నగ్నంగా ఉండడంతో.. శృంగారంలో పాల్గొన్నట్టుగా నిర్దారించారు. స్కోడా కారులో షికారుకు వెళ్లిన యువ జంట.. ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో.. ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

కాగా, స్థానిక కేటరింగ్ కాలేజీ నుంచి ఆర్టమ్ ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. భవిష్యత్తులో వ్యాపార రంగంలోకి దిగాలని కలలు కంటున్న అతడు ఇలా విషాదంగా మారిపోవడంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications