రికార్డు: విండ్ టన్నెల్లో 31 నిమిషాలు ముద్దులు
లండన్: ఓ ప్రేమ జంట ముద్దులు పెట్టుకోవడం రికార్డు సృష్టించింది. ప్రేమ పక్షులు టెర్రీ కాస్, మట్ లిపెర్ట్ విండ్ టన్నెల్‌లో 31 నిమిషాల నాలుగ సెకన్ల పాటు ముద్దుల్లో ముంచెత్తుకున్నారు. మాంచెస్టర్‌కు చెందిన ఈ జంట గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో ముద్దుమురిపాలు కురిపించారు.
తమకు క్లౌడ్ నైన్‌పై ఉన్నట్లుగా తాము అనుభూతి చెందామని విజేత లిపెర్ట్ అన్నారు. రికార్డును బద్దలు కొట్టినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ రికార్డును నిలబెట్టుకోవడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటామని చెప్పినట్లు డైలీ స్టార్ రాసింది.

మాంచెస్టర్‌లోని ఎయిర్‌కిక్స్ ఇండూర్ స్కైడైవింగ్ సెంటర్స్‌లోజరిగిన పోటీల్లో పాల్గొని ఆ జంట రికార్డు సృష్టించింది. బేసింగ్‌స్టోక్ దంపతులు 23 నిమిషాల 43 సెకన్ల పాటు ముద్దుల వర్షం కురిపించుకున్నారు.
మిల్టన్ కీనెస్ జంట 14 నిమిషాల 30 సెకన్లు మాత్రమే ముద్దులు పెట్టుకున్నారు. రికార్డు సృష్టించిన జంట ఫొటో ట్విట్టర్‌లో పోస్టయింది.












Click it and Unblock the Notifications