ఐ ఫోన్ కోసం ఫేస్ బుక్ లో బిడ్డను అమ్మేశాడు
బీజింగ్: ఖరీదైన సెల్ ఫోన్, బైక్ కోసం పసికందును అమ్ముకున్నాడు ఓ దరిద్రిడు. ఆగ్నేయ చైనాలోని పుజియాన్ రాష్ర్టానికి చెందిన డ్యూన్ (19) తన 18 రోజుల పసికందును సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టాడు. దాదాపు రూ. 2.34 లక్షలకు బిడ్డను అమ్మేస్తానని వివరాలు వెల్లడించాడు.
విషయం తెలుసుకున్న అధికారులు డ్యూన్ దంపతులను అరెస్టు చేసి జైలుకు పంపించి బిడ్డను బాలల సంరక్షణాలయానికి తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డ్యూన్ స్థానికంగా ఉన్న ఓ ఇంటర్ నెట్ సెంటర్ లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అతడి భార్య అనుకోకుండా గర్బం దాల్చి పాపకు జన్మనిచ్చింది. పాపను విక్రయించి ఐ ఫోన్, బైక్ కొనుక్కోవాలని డ్యూన్ ప్లాన్ వేశాడు. పాపను ఓ వ్యక్తికి అమ్మేశాడు. పాపను తీసుకున్న వ్యక్తి, డ్యూన్ అక్కడి నుంచి పరారైనారు. విషయం తెలుసుకున్న అధికారులు వీరి కోసం గాలించారు.
చివరికి పాపను కొనుక్కోన్న వ్యక్తి పోలీసుల ముందు హాజరైనాడు. పాపను పోలీసులకు అప్పగించాడు. బిడ్డను విక్రయించడం నేరం అని తనకు తెలియదని డ్యూన్ భార్య జియావో మెయి (18) పోలీసులకు చెప్పింది. ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా ఇలా చేశామని డ్యూన్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు దంపతులను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications