గాల్లో కూడా గంటల పాటు జీవించే సత్తా ఉన్న కరోనా.. వైద్య సిబ్బందికి డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం

జెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఓ సరికొత్త విషయాన్ని గుర్తించింది. గాల్లో కూడా ఆ వైరస్.. కొన్ని గంటల పాటు జీవించే సత్తా ఉందని పేర్కొంది. ఎలాంటి వాతావరణంలోనైనా కొన్ని గంటల పాటు జీవించే శక్తిసామర్థ్యాలు దీనికి ఉన్నాయని వెల్లడించింది. ఆ సూక్ష్మజీవికి గాల్లో కూడా జీవించగలదని తేలింది. దీనితో వైద్య సిబ్బందిని డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం చేసింది.

కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని మాత్రమే ఇప్పటిదాకా మనకు తెలిసిన విషయం. తాజాగా- ఇది గాల్లో కూడా కొన్ని గంటల పాటు జీవించే ఉంటుందనే విషయం తెలియడంతో డబ్ల్యూహెచ్ఓ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్‌లల్లో కరోనా వైరస్ అనుమానితులకు వైద్య, చికిత్సలను అందించే సిబ్బందికి వర్తింపజేసేలా సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. భారత్ సహా చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా వంటి దేశాల్లో మూడు లక్షలమందికి పైగా ఈ ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. అలాగే లక్షలాది మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది వారికి చికిత్స చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైరస్ బాధితులకు నిరంతరాయంగా సేవలను అందిస్తున్నారు. అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆసుపత్రుల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.

Covid-19 can survive in the air for hours, WHO is considering new precautions for medical professionals

ఈ పరిస్థితుల్లో వైద్య సిబ్బంది ఆరోగ్య స్థితిగతుల పరిస్థితి ఏమిటనే విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. వైద్య సిబ్బందికి అప్రమత్తం చేసింది. వైరస్ సోకిన వ్యక్తికి చికిత్స అందించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. బాధితుడి శరీరం నుంచి వెలుపలికి వచ్చే వైరస్..కొన్ని గంటల పాటు గాల్లో సజీవంగా ఉంటుందని, ఆ సమయంలో అది వైద్య సిబ్బందికి సోకే ప్రమాదం ఉందని సంక్రమిత వ్యాధులు, జునోసిస్ విభాగం చీఫ్ డాక్టర్ మారియా వ్యాన్ కెర్‌ఖోవ్ స్పష్టం చేశారు.

రోగి తుమ్మినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ వైరస్ గాల్లోకి వెలువడుతుందని, కొన్ని గంటల పాటు అది గాల్లోనే జీవించి ఉంటుందని డాక్టర్ మారియా వెల్లడించారు. ఆ సమయంలో అది వేరొకరికి సోకే ప్రమాదం ఉందని, ప్రత్యేకించి- వైద్యి సిబ్బంది దీని బారిన పడే అవకాశం ఉందని అన్నారు. దీన్ని నిరోధించడానికి విధి నిర్వహణలో ఉండే వైద్య సిబ్బంది తప్పనిసరిగా ఎన్ 95 మాస్కులను ధరించాలని పేర్కొన్నారు. శ్వాస పీల్చుకునే సమయంలో గాల్లో ఉండే 95 శాతం సూక్ష్మక్రిములను ఈ తరహా మాస్కులు అడ్డుకుంటాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+