అమెరికా రాష్ట్రాల్లోనే: అధ్యక్ష ఎన్నికలకు 2 రోజుల ముందుగానే సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. రష్యా ఇప్పటికే స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే, అది ఇంకా బయటి మార్కెట్లోకి రాలేదు. అంతేగాక, దానిపై పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

నవంబర్ 1 నాటికి సమర్థవంతమైన కరోనా టీకా

నవంబర్ 1 నాటికి సమర్థవంతమైన కరోనా టీకా

ప్రపంచానికి ముందుగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు అమెరికా కూడా ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. నవంబర్ 1 నాటికి లేదంటే అంతకంటే ముందే సమర్థవంతమైన కరోనా టీకను ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధం కావాలని ఆ దేశ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండ్రోజుల ముందే..

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండ్రోజుల ముందే..

వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అవసరమైన వసతులపై దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆగస్టు 27న సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ రాసిన రాసిన లేఖలో పేర్కొన్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే విషయాన్ని తన కథనంలో పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందే వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఇది ప్లస్ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మూడో దశకు హ్యూమన్ ట్రయల్స్..

మూడో దశకు హ్యూమన్ ట్రయల్స్..


కాగా, అమెరికా వ్యాప్తంగా 80 నగరాల్లో వివిధ ప్రయోగకేంద్రాలు 30 వేల మంది వాలంటీర్లను నమోదు చేసుకున్నాయని అస్ట్రాజెనికా కూడా వెల్లడించింది. ఈ వాలంటీర్లంతా 18 ఏళ్ల పైబడినవారేనని, వివిధ సంస్కృతులు, జాతులు, భౌగోళిక ప్రాంతాలకు చెందినవారు వీరిలో ఉన్నట్లు తెలిపింది. కాగా, ఏడు వ్యాక్సిన్ అభ్యర్థులు హ్యూమన్ ట్రయల్స్ మూడో దశకు చేరుకున్నాయి. వీటిలో ఆక్స్‌యూనివర్సిటీ సహకారంతో అభివృద్ధి చెందుతున్న ఆస్ట్రాజెనికా, మోడెర్నా, ఫైజర్ ఉన్నాయి.

Recommended Video

    China Vs USA : రెండు భారీ DF శ్రేణి క్షిపణుల ప్రయోగం..!! || Oneindia Telugu
    వ్యాక్సిన్ పంపిణీలో తాము భిన్నమంటూ డొనాల్డ్ ట్రంప్

    వ్యాక్సిన్ పంపిణీలో తాము భిన్నమంటూ డొనాల్డ్ ట్రంప్


    ఇది ఇలావుండగా, అస్ట్రాజెనికా వ్యాక్సిన్ తుది ఆమోదానికి చేరువలో ఉందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇలాగే, వ్యాక్సిన్ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడిన ప్రపంచ కూటమితో తాము కలిసి నడవబోమని కూడా ప్రకటించడం గమనార్హం. అంటే, ఒకవేళ అమెరికా నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చినట్లయితే.. ఆ వ్యాక్సిన్ ఏయే దేశాలకు పంపిణీ చేయాలో అమెరికా అధ్యక్షుడే నిర్ణయిస్తారని తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+