వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్: కష్టకాలంలో భారత్‌కు సాయం చేస్తామన్న పాకిస్తాన్‌.. వెంటిలేటర్లు, ఇతర పరికరాలు పంపిస్తామని ట్వీట్: Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇమ్రాన్ ఖాన్

కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న భారత్‌కు సాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ చెప్పింది.

భారత్‌లో గత మూడు రోజులుగా ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారితో తీవ్రంగా ప్రభావితం అవుతున్న భారత్‌కు అత్యవసర మెడికల్ పరికరాలను అందించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.

https://twitter.com/SMQureshiPTI/status/1386018074407710721

"కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు వెంటిలేటర్లు, బై పాప్ మెషిన్లు, డిజిటల్ ఎక్స్ రే మెషిన్లు, పీపీఈ కి‌ట్లు, ఇతర అత్యవసర మెడికల్ పరికరాలు అందిస్తాం. మేం 'హ్యుమానిటీ ఫస్ట్' అనే విధానాన్ని విశ్వసిస్తున్నాం" అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు.

ఈ పరికరాలు వీలైనంత త్వరగా భారత్ చేరుకోవడానికి, ఇరు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు కలిసి పనిచేయాలని పాకిస్తాన్ తన ప్రకటనలో కోరింది.

"మహమ్మారి వల్ల ముందు ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి రెండు దేశాలూ తగిన విధానాలను కూడా అన్వేషించవచ్చు" అని కూడా పాక్ అందులో పేర్కొంది.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా కరోనా సంక్షోభ సమయంలో భారత ప్రజలకు తన సంఘీభావం తెలిపారు.

https://twitter.com/ImranKhanPTI/status/1385864226925842433

"పొరుగు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కోవిడ్-19 వైరస్‌తో పోరాడుతున్న ప్రజలు వీలైనంత త్వరగా కోలుకోవాలని పాకిస్తాన్ ప్రార్థిస్తోంది" అని అన్నారు.

"మానవాళి ఎదుర్కొంటున్న ఈ సవాల్‌తో మనమంతా కలిసి పోరాడాలని" ఆయన పిలుపునిచ్చారు.

పాకిస్తాన్‌కు చెందిన చాలా మంది ప్రజలు కూడా భారత్‌కు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

English summary
Covid: Pakistan will send ventilators and other equipment to help India in difficult times
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X