రష్యన్ విమానంలో రచ్చ రచ్చ: మహిళా ప్రయాణికులపై లైంగిక దాడి..

మాస్కో: ఓ రష్యన్ విమానంలో ప్రయాణికుడు(47) ఒకరు రచ్చ రచ్చ చేశాడు. మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా.. ఓ చిన్నారిపై సైతం దాడి చేయబోయాడు.

అడ్డుకోబోయిన పురుష ప్రయాణికులపై కూడా ఇష్టారీతిన దాడి చేశాడు. విమానం గాల్లో ఉండగానే సదరు ప్రయాణికుడు ఇలా రెచ్చిపోవడం.. మిగతా ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

విమానమంతా కలియదిరుగుతూ ప్రయాణికుల్ని బండబూతులు తిట్టిన అతను ఎక్కువగా మహిళలనే టార్గెట్ చేశాడు. తనను చూసి భయపడుతున్నవారిపై అకారణంగా రెచ్చిపోయాడు. కేవలం దాడులు మాత్రమే కాదు, ప్రయాణికుల ముందు షర్ట్ విప్పేసి అసభ్యంగా ప్రవర్తించాడు.

విమానంలోని ఇతర ప్రయాణికులు, కేబిన్ సిబ్బంది కలిసి ఎట్టకేలకు సదరు ప్రయాణికుడిని నియంత్రించారు. ఎయిర్ పోర్ట్ సిబ్బందికి సమాచారం అందించడంతో నోవోసిబిస్క్ అనే ఎయిర్ పోర్టులో సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించగా అక్కడ కూడా రెచ్చిపోయాడు. సెల్ గోడలను కాళ్లు చేతులతో గట్టిగా తన్నడంతో పాటు పోలీసులపై విరుచుకుపడ్డాడు. గన్‌తో కాలుస్తున్నట్టుగా చేతులతోనే సైగలు చేశాడు.

 Crazed Passenger ‘sexually Assaults Woman In Terrifying Mid-air Rampage On Russia Flight

అతని అరెస్ట్ అనంతరం విమాన ప్రయాణికులు మీడియాతో మాట్లాడారు. మొదట ఓ మహిళ పక్కన వచ్చి కూర్చున్న అతను.. ఆమెను లైంగికంగా వేధించాడని చెప్పారు. ఆమెను జుట్టుపట్టి ఈడ్చి కొట్టాడన్నారు. ఆ వెంటనే మరో యువకుడి వద్దకు వెళ్లి మోచేయితో అతన్ని తీవ్రంగా కొట్టాడని చెప్పారు.

మరో సీట్లో కూర్చున్న ఓ చిన్నారి వద్దకు వెళ్లి ఆమె మెడ పట్టుకుని దాడి చేశారని చెప్పారు. మరో బేబీని చేతుల్లోకి తీసుకుని అసభ్య పదజాలంతో దూషించాడని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+