జపాన్ సముద్ర తీరంలో వింతజీవి (ఫోటోలు)
టోక్యో: జపాన్ సమద్రతీరంలో ఓ వింత జీవి కనిపించి మత్స్యకారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే, సెంట్రల్ జపాన్‌లోని టొయామా బే తీరంలో 12 నుంచి 13 అడుగుల పొడవు ఉన్న ఒక వింత జీవి సముద్రంలో చేపలు పడుతున్న మత్స్యకారుల పడవుల కింద గుండా వెళ్లి ఆశ్చర్యపరిచింది.
ఈ వింతజీవిని చూసిన పలువురు మత్స్యకారుల ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ వింతజీవిని సముద్రంలో అమర్చిన కెమెరా వీడియో తీసింది. కొన్ని గంటల పాటు బే ఏరియాలోని సముద్ర ఉపరితలంపై ఈ వింతజీవి తిరిగాడింది.
దీంతో ఈ వింత జీవిని చూసేందుకు అక్కడి ప్రజలు, మత్స్యకారులు పోటీపడ్డారు. ఈ తరహా అరుదైన జీవులలో ఇది చిన్నదని, ఇది సుమారు 43 అడుగుల పొడవు పెరుగుతుందని డైవింగ్ షాప్ కయు యజమాని అకినోబు కిముర అభిప్రాయపడ్డాడు.
ఈ వింతజీవిన చూసిన క్షణంలో ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతతో సముద్రంలోని దూకినట్లు, తాను ఈ వింతజీవిని చాలా దగ్గరగా చూసినట్లు చెప్పుకొచ్చాడు. సముద్రం లోపల తెలుపు, ఎరుపు రంగుల్లో కనిపించిన ఈ వింతజీవి అరుదుగా ఇలా కనువిందు చేస్తుందని అక్కడి స్థానికులు పేర్కొన్నారు.

జపాన్ సముద్ర తీరంలో వింతజీవి
జపాన్ సమద్రతీరంలో ఓ వింత జీవి కనిపించి మత్స్యకారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే, సెంట్రల్ జపాన్‌లోని టొయామా బే తీరంలో 12 నుంచి 13 అడుగుల పొడవు ఉన్న ఒక వింత జీవి సముద్రంలో చేపలు పడుతున్న మత్స్యకారుల పడవుల కింద గుండా వెళ్లి ఆశ్చర్యపరిచింది.

జపాన్ సముద్ర తీరంలో వింతజీవి
ఈ వింతజీవిని చూసిన పలువురు మత్స్యకారుల ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ వింతజీవిని సముద్రంలో అమర్చిన కెమెరా వీడియో తీసింది. కొన్ని గంటల పాటు బే ఏరియాలోని సముద్ర ఉపరితలంపై ఈ వింతజీవి తిరిగాడింది.

జపాన్ సముద్ర తీరంలో వింతజీవి
దీంతో ఈ వింత జీవిని చూసేందుకు అక్కడి ప్రజలు, మత్స్యకారులు పోటీపడ్డారు. ఈ తరహా అరుదైన జీవులలో ఇది చిన్నదని, ఇది సుమారు 43 అడుగుల పొడవు పెరుగుతుందని డైవింగ్ షాప్ కయు యజమాని అకినోబు కిముర అభిప్రాయపడ్డాడు.

జపాన్ సముద్ర తీరంలో వింతజీవి
ఈ వింతజీవిని చూసిన క్షణంలో ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతతో సముద్రంలోని దూకినట్లు, తాను ఈ వింతజీవిని చాలా దగ్గరగా చూసినట్లు చెప్పుకొచ్చాడు. సముద్రం లోపల తెలుపు, ఎరుపు రంగుల్లో కనిపించిన ఈ వింతజీవి అరుదుగా ఇలా కనువిందు చేస్తుందని అక్కడి స్థానికులు పేర్కొన్నారు.

Click it and Unblock the Notifications