Credit Suisse: అదానికి షాక్ ఇచ్చిన బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో- బిగ్ వికెట్ అవుట్

స్విట్జర్లాండ్ కు చెందిన ప్రఖ్యాత గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూయిస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సంస్థ షేర్లు ఒక్కరోజులో 24 శాతం మేర పడిపోయాయి.

వాషింగ్టన్: స్విట్జర్లాండ్ కు చెందిన ప్రఖ్యాత గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూయిస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సంస్థ షేర్లు ఒక్కరోజులో 24.24 శాతం మేర పడిపోయాయి. మొన్నటికి మొన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిన తరువాత అదే దారిలో తాజాగా క్రెడిట్ సూయిస్ ప్రయాణిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్థికమాంద్యం దీనికి కారణంగా భావిస్తోన్నారు.

సిలికాన్ బ్యాంక్ తరువాత..

సిలికాన్ బ్యాంక్ తరువాత..

అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇటీవలే మూతపడిన విషయం తెలిసిందే. ఎక్కువగా టెక్ స్టార్టప్‌లకు రుణాలను మంజూరు చేస్తుంటుందీ బ్యాంక్. ఇప్పుడు ఇది దివాళా తీసే పరిస్థితి రావడంతో అమెరికన్ రెగ్యులేటరీస్ దీన్ని మూసివేశాయి. బ్యాంకు అకౌంట్లు, ఇతర లావాదేవీలన్నింటినీ తమ అధీనంలోకి తీసుకున్నాయి. 2008 ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం తరువాత అమెరికాలో మూతపడిన అతిపెద్ద బ్యాంకు ఇదే.

అదానికి జీరో వ్యాల్యూ..

అదానికి జీరో వ్యాల్యూ..

ఇప్పుడు తాజాగా క్రెడిట్ సూయిస్ సంస్థ సరిగ్గా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఇదివరకు అదానీ కంపెనీల బాండ్ల ల్యాండింగ్ విలువను సున్నాకు తగ్గించింది ఇదే బ్యాంక్. అదానీ గ్రూపు బాండ్లను తాకట్టి పెట్టి క్రెడిట్ సూయిస్ బ్యాంక్ లో రుణాలు తీసుకునే వెసులుబాటును రద్దయింది అప్పట్లో. రద్దు కావడానికి ముందే అదాని బాండ్లు అందులో తాకట్టు పెట్టి రుణం తీసుకుని ఉంటే దానికి అదనపు పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది.

24 శాతం మేర..

24 శాతం మేర..

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ బాండ్ల ల్యాండింగ్ విలువను క్రెడిట్ సూయిస్ బ్యాంకు సున్నాకు తగ్గించింది అప్పట్లో. ఇప్పుడు అదే బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ఒక్కరోజులో 24.24 శాతం మేర ఆ కంపెనీ షేర్ల విలువ పడిపోయింది. దీన్ని గ్రేట్ ఫాల్గా అభివర్ణిస్తోన్నారు ఆర్థిక రంగ విశ్లేషకులు. ఇదివరకెప్పుడూ ఈ స్థాయిలో ఆ బ్యాంక్ నష్టపోలేదు.

సౌదీ నేషనల్ బ్యాంక్ ప్రకటనతో..

సౌదీ నేషనల్ బ్యాంక్ ప్రకటనతో..

ఇవ్వాళ పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు- క్రెడిట్ సూయిస్ షేర్లను అమ్ముకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ సంస్థలో బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ గా ఉన్న సౌదీ నేషనల్ బ్యాంక్.. కీలక ప్రకటన విడుదల చేయడమే. రెగ్యులేటరీ సమస్యలు ఉన్నందున తాము 10 శాతం కంటే అధికంగా పెట్టుబడి వాటాలను పెంచుకోలేమని ప్రకటించింది సౌదీ నేషనల్ బ్యాంక్. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఇన్వెస్టర్లు క్రెడిట్ సూయిస్ షేర్లను పెద్ద ఎత్తున అమ్ముకున్నారు.

నీల్ కాంత్ మిశ్రా రాజీనామా..

నీల్ కాంత్ మిశ్రా రాజీనామా..

ఈ పరిణామాల మధ్యే- భారత్ కేంద్రంగా పని చేస్తోన్న క్రెడిట్ సూయిస్ ఆసియా పసిఫిక్ కో హెడ్, సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగాధిపతి నీల్ కాంత్ మిశ్రా తన పదవికి రాజీనామా చేశారు. క్రెడిట్ సూయిస్ కు గుడ్ బై చెప్పారు. యాక్సిస్ బ్యాంక్ లో ఆక్ష్న జాయిన్ కానున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెగ్మెంట్స్ లో దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా అనుభవం ఉందాయనకు. వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ బిజినెస్‌ తో సహా వివిధ వ్యాపారాలను బలోపేతం చేయడానికి ఆయనను చేర్చుకోనుంది యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+