Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇమ్రాన్, యాంకర్ పెళ్లి: సోదరి గైర్హాజరు, ఆ విషయం తెలియదని...

బనిగల: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తన భార్య, యాంకర్ రెహామ్ ఖాన్‌తో కలిసి కనిపించారు. పెళ్లి అనంతరం గురువారం నాడు ఇమ్రాన్, రెహామ్ ఖాన్ పాకిస్తాన్‌లోని బనిగలలో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇమ్రాన్, రెహామ్ పెళ్లికి పలువురు హాజరయ్యారు. వారి పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఎదుట ఈరోజు జరిగింది. ఇటీవల పెషావర్ కాల్పుల ఘటనలో 140 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో ఈ వేడుకను పెద్ద ఎత్తున జరపవద్దని ఇమ్రాన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Cricket Legend Imran Khan Marries Ex-BBC Journalist Reham Khan

వీరి పెళ్లి నేపథ్యంలో శుక్రవారం నాడు పాకిస్తాన్‌లోని పేదలకు పండ్లు తదితరాలు పంచనున్నారు. ఈ పెళ్లికి ఇమ్రాన్ సోదరి హాజరు కాలేదు. ఈ పెళ్లి వేడుక కోసం కట్నం రూపంలో ఎనభై రెండు వేల రూపాయలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

మరోవైపు, ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న రెహామ్ ఖాన్ ఓ ట్వీట్ చేశారు. ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీని పైన ఆమె ట్వీట్ చేశారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌లో విడాకులకు అనుమతి లేదనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ ఆమెను రహస్యంగా ఇటీవలె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తన మద్దతుదారుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు. దీంతో మరోసారి పెళ్లి జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+