రొనాల్డోకు అమ్మాయి ఫోన్ దొరికింది: తిరిగిచ్చి డిన్నర్

లాస్ వెగాస్: తన ఫోన్ పోయిందని, అది ప్రముఖ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డోకి దొరికిందని, దానిని అతను తనకు తిరిగి ఇచ్చాడని ఓ యువతి స్నేహితులకు డిన్నర్ ఇచ్చింది. లాస్ వెగాస్ పర్యటనలో తన ఫోన్ పోగొట్టుకున్నట్లు చెప్పింది.

ఆమె పేరు ఆస్టిన్ ఊల్‌స్టెన్‌హమ్‌. ఈ యువతి ఇటీవల ఒక పోస్ట్ చేసింది. 'బ్యాడ్‌ న్యూస్‌ ఏమిటంటే నా స్మార్ట్‌ ఫోన్‌ పోగొట్టుకున్నాను.' ఆ తర్వాత. రాసింది అందర్నీ ఆశ్చర్యపరిచింది. 'గుడ్‌ న్యూస్‌ ఏమిటంటే ఆ ఫోన్‌ ఫుట్‌బాల్‌ వీరుడు క్రిస్టియానో రొనాల్డోకి దొరికింది.' అని రాసింది.

Cristiano Ronaldo Finds Woman's Lost Cell Phone in Las Vegas

రోడ్డు మీద వెళ్తుంటే ఫుట్‌బాలర్ రొనాల్డోకి ఆ ఫోన్‌ దొరికిందని, వెంటనే ఆ ఫోన్‌ని పట్టుకుని అందులోని నంబర్లను బట్టి ఫోన్ చేశాడని, అది తనదా అని రొనాల్డో అడిగాడని, తాను అవునని చెప్పానని పేర్కొంది.

డోంట్‌ వర్రీ ఆ ఫోన్‌ నాకు దొరికిందని చెప్పాడని, అప్పటికీ రోనాల్డొ తాను ఫలానా అని చెప్పలేదని, ఆ తర్వాత ఫలానాచోట ఉన్నాను, వచ్చి ఫోన్‌ తీసుకొమన్నాడని, తన స్నేహితురాళ్లతో కలిసి అతనున్న చోటకి వెళ్లి ఆశ్చర్యపోయానని, ఆ తర్వాత అందరం కలిసి డిన్నర్‌ చేద్దామని చెప్పాడని, తనతో పాటు తన స్నేహితురాళ్లకు రొనాల్డో డిన్నర్ ఇచ్చాడని పేర్కొంది. స్మార్ట్‌ ఫోన్ దొరకడమే కాకుండా, తనకు రొనాల్డో డిన్నర్ ఇచ్చాడని పేర్కొంది. రొనాల్డోతో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+