కుప్పకూలిన క్యూబా విమానం: లోపల 104మంది..
హవానా: 104మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ క్యూబా విమానం హవానా జోస్ మార్తి విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. బ్లూ పనోరమా ఎయిర్ లైన్స్ కి చెందిన ఈ బోయింగ్ 737 విమానాన్ని క్యూబా లీజుకు తీసుకుంది.

విమానం హవానా నుంచి హెల్గెయిన్ నగరం వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ హవానా, సాంటియాగో నగరాల మధ్య స్థానిక కాలమానం ప్రకారం 12.30గం.కి విమానం కుప్పకూలినట్టుగా చెబుతున్నారు.
అయితే ఈ ప్రమాద ఘటనలో ఎవరైనా మృత్యువాత పడ్డారా అన్నది ఇంకా తెలియరాలేదు. అయితే బాధితుల సంఖ్య మాత్రం ఎక్కవగానే ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు. విమానం కూలిన ప్రదేశంలో మంటలు చెలరేగడంతో.. ఫైరింజన్ సిబ్బంది మంటలను ఆర్పారు.












Click it and Unblock the Notifications