ప్రపంచంలోనే తొలిసారి.. డ్రోన్ జంప్ చేసిన స్కైడైవర్.. (వీడియో)

ప‌్ర‌పంచంలోనే తొలిసారిగా ఓ స్కైడైవ‌ర్‌ ఓ డ్రోన్‌ను ప‌ట్టుకొని వెయ్యి అడుగుల ఎత్తున ఆకాశంలోకెళ్లి అక్క‌డ నుంచి జంప్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అయింది.. మీరూ చూడండి!

లాత్వియా: ప‌్ర‌పంచంలోనే తొలిసారిగా ఓ స్కైడైవ‌ర్‌ 'డ్రోన్ జంప్' చేశాడు. లాత్వియాలోని అమాటాలో గ‌త శుక్ర‌వారం ఈ డేర్‌డెవిల్ స్టంట్ చేశాడ‌త‌డు. డ్రోన్‌ను ప‌ట్టుకొని వెయ్యి అడుగుల ఎత్తుకెళ్లిన స్కైడైవ‌ర్ ఇంగ‌స్ ఆగ్‌స్టాకాన్స్.. అక్క‌డ నుంచి జంప్ చేశాడు.

ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అయింది. మే 12న దీనిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌గా.. ఇప్ప‌టికే మూడు ల‌క్ష‌ల‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. డ్రోన్ల ద్వారా ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉంటాయో చెప్ప‌డానికే ఈ డ్రోన్ డైవింగ్‌ ప్లాన్ చేసిన‌ట్లు త‌యారీ కంపెనీ వెల్ల‌డించింది.

ఇదేం చిన్నా చితకా డ్రోన్ కాదు. ఏకంగా మనిషినే ఆకాశంలోకి తీసుకెళ్లగలదు. ఈ డ్రోన్ ధ‌ర మ‌న కరెన్సీలో రూ.23 ల‌క్ష‌లు. గంట‌కు గ‌రిష్ఠంగా 150 కిలోమీట‌ర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 200 కేజీల వరకు బ‌రువు మోయ‌గ‌ల‌దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+