700 మందికి పైగా షేర్లు: కూతురి నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టారు

ఆస్ట్రియా: కూతురి మాన మర్యాదలు కాపాడాల్సిన తల్లిదండ్రులే ఆమె నగ్నచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఘటన ఆస్ట్రియా దేశంలో జరిగింది. ఆస్ట్రియాలోని దక్షిణి కరింతియా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి సన్నిహితునితో అన్యోన్యంగా గడుపుతూ ఉన్న చిత్రాలు, మంచంపై నగ్నంగా పడుకున్న చిత్రాలను ఆమె అనుమతి లేకుండానే ఆమె తల్లిదండ్రులే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

2009 నుంచి ఇప్పటి వరకు తనకు సంబంధించిన 500 నగ్న చిత్రాలను ఫేస్ బుక్‌లో పోస్టు చేసినట్లు బాధిత యువతి పేర్కొంది. ఇప్పటి వరకు ఆ చిత్రాలను 700 మందికి పైగా షేర్ చేసుకున్నారు. తాను టాయ్ లెట్ గదిలో ఉన్నపుడు, మంచంపై నగ్నంగా పడుకున్నపుడు ఇలా తీసిన ఫోటోలను ఫేస్‌బుక్‌‌లో పెట్టి తన పరువు తీశారని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

 తల్లిదండ్రులపై కోర్టును ఆశ్రయించిన యువతి

తల్లిదండ్రులపై కోర్టును ఆశ్రయించిన యువతి


తన అశ్లీల ఫోటోలను తొలగించమని తాను ఎన్నిసార్లు కోరినా తన తండ్రి వాటిని తొలగించకపోగా, ఆ ఫోటోలు పెట్టే హక్కు తండ్రిగా తనకు ఉందని చెప్పడం తనను ఎంతో బాధించిందని వాపోయింది. దీనిపై సదరు యువతి తన తల్లిదండ్రులపై కోర్టును ఆశ్రయించింది.

 వ్యక్తిగత జీవితానికి భంగం

వ్యక్తిగత జీవితానికి భంగం


కూతురి అశ్లీల చిత్రాలు పెట్టి ఆమె వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించారని, ఆమెకున్న హక్కులను కాలరాచారని యువతి న్యాయవాది మైఖేల్ రామి చెప్పారు. ఆస్ట్రియా దేశంలో మొట్టమొదటి సారి ఇలాంటి కేసు నమోదైందని, అదే విదేశాల్లో అయితే ఇలాంటి కేసుల్లో తల్లిదండ్రులు కూతురికి నష్టపరిహారం చెల్లించడంతోపాటు ఆమె పడిన బాధకు, న్యాయ ఖర్చులు భరించేలా తీర్పు వెలువడుతుందని న్యాయవాది రామి పేర్కొన్నారు.

కేసు విచారణ నవంబర్‌లో

కేసు విచారణ నవంబర్‌లో


కోర్టులో ఈ కేసు విచారణ నవంబర్ నెలలో జరగనుంది. ఈ కేసులో యువతి తల్లిదండ్రులు ఓడిపోతే దాని పర్యవసానాలు ఆస్ట్రియాలో చాలామంది తల్లిదండ్రులపై ఉంటుందని ఆయన తెలిపారు. ఆస్ట్రియాలో అమలులో ఉన్న చట్టాలు సామాజిక మాధ్యమాల్లో విషయంలో కఠినంగా లేక పోవడం విశేషం.

 ఫ్రాన్స్ ఇది నేరం

ఫ్రాన్స్ ఇది నేరం


కానీ ఫ్రాన్స్ దేశంలో ఇలా ఒకరి ఆమోదం లేకుండా మరొకరు వారి చిత్రాలు సోషల్ మీడియాలో పెడితే వారికి ఏడాది జైలు శిక్షతోపాటు 45,000 యూరోల జరిమానా కూడా విధిస్తారట. ఈ కేసు తీర్పు కోసం నవంబరు నెల వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+