ఆశ్చర్యపోయా..! : 'సెక్స్ స్కాండల్' పై డేవిడ్

స్పెయిన్ : క్రీడలు పార్టీ కల్చర్ తో మిక్స్ అయిపోయి చాలా ఏళ్లే అవుతుంది. క్రికెట్, ఫుట్ బాల్ అన్న తేడా లేకుండా ఆట ఏదైనా సరే, మ్యాచ్ గెలిచాక రాత్రంతా పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేయడం క్రీడాకారులకు పరిపాటిగా మారిపోయింది. ఆయా జట్ల మేనేజ్ మెంట్స్ కూడా విలాసవంతమైన పార్టీలకు ఎప్పుడూ ముందే ఉండడం లేట్ నైట్ పార్టీలకు మరింత ఊతమిస్తోంది.

ఇక అసలు విషయానికొస్తే.. స్పెయిన్ ఫుట్ బాల్ గోల్ కీపర్ డేవిడ్ డి గియా తన సహచర ఆటగాళ్లకు ఇచ్చిన ఓ పార్టీ వివాదాల్లోకి ఎక్కింది. డేవిడ్ ఇచ్చిన పార్టీలో కొంతమంది మహిళలను సెక్స్ లో పాల్గొనాలంటూ పార్టీకి వచ్చిన ఆటగాళ్లు ఒత్తిడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీనికి సంబంధించి పార్టీలో పాల్గొన్న ఓ మహిళ మాట్లాడుతూ.. పార్టికి హాజరైన తనను సెక్స్ లో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని, తనతో పాటు మరో మహిళను కూడా వేధించారని ఆరోపించింది. దీంతో పాటు మరో బాంబు పేల్చిన ఆ మహిళ పార్టీలో కొంతమంది ఫుట్ బాల్ ఆటగాళ్లతో తాము సెక్స్ లో పాల్గొన్నట్టు వెల్లడించింది. అయితే డేవిడ్ మాత్రం తాము సెక్స్ లో పాల్గొనలేదని తెలిపింది.

David de Gea denies role in sex scandal that has rocked Spain’s Euro 2016 build-up

కాగా, మహిళ ఆరోపణల పట్ల స్పందించిన ఆటగాడు డేవిడ్ మాత్రం అవన్నీ అసత్యాలని కొట్టిపారేశాడు. తనపై వస్తోన్నఆరోపణల్లో నిజం లేదని చెప్పుకొచ్చిన డేవిడ్, తొలుత ఈ ఆరోపణలు విని ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పాడు. దీనిపై మీడియాతో మాట్లాడిన డేవిడ్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, ఇలాంటి ఆరోపణలు నాకు మరింత బలాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నాడు.

ప్రస్తుతం కేసు తన లాయర్ల చేతుల్లో ఉందని వెల్లడించిన డేవిడ్.. త్వరలోనే జాతీయ టీమ్ తరుపున బరిలోకి దిగబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+