వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్ సైట్లపై కోర్టులో పిటిషన్ వేసిన వికలాంగుడు.. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం,ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత పోర్న్ మార్కెట్ కూడా అంతే స్థాయిలో విస్తరించింది. కొన్ని దేశాల్లో పోర్న్ సైట్లపై నిషేధం ఉన్నప్పటికీ.. చాలా దేశాల్లో పోర్న్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. పోర్న్ కంటెంట్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న చర్చ పక్కనపెడితే.. పోర్న్ విషయంలో వికలాంగుల పట్ల వివక్ష నెలకొందని ఓ వికలాంగ వ్యక్తి ఏకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏంటా పిటిషన్

 ఎవరా వ్యక్తి..

ఎవరా వ్యక్తి..

అమెరికాలోని న్యూయార్క్‌కి చెందిన యారోస్లావ్‌ సూరిస్‌ అనే ఓ చెవిటి వ్యక్తి.. పోర్న్ సైట్లు వికలాంగ వివక్ష వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోర్న్ వీడియోల్లో క్లోజ్డ్ క్యాప్షన్(డైలాగ్స్‌ను టెక్స్ట్ రూపంలో స్క్రీన్ చూపించడం) లేకపోవడం వల్ల.. చెవిటి వాడినైన తాను ఆ వీడియోలను ఆస్వాదించలేకపోతున్నానని అందులో పేర్కొన్నాడు.

ఆ మూడు సైట్లపై..

ఆ మూడు సైట్లపై..

రెడ్‌ట్యూబ్,యూపోర్న్‌తో పాటు మరో కెనడియన్ పోర్న్ కంపెనీపై అతను పిటిషన్ దాఖలు చేశాడు. క్లోజ్డ్ క్యాప్షనింగ్ లేకపోవడం వల్ల సాధారణ ప్రజల్లాగా తాము పోర్న్ వీడియోలను ఆస్వాదించలేకపోతన్నామని, కాబట్టి పోర్న్ సైట్లు ఆ ఆప్షన్‌ను ప్రొవైడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దాదాపు 23 పేజీల ఫిర్యాదును పిటిషన్‌లో అతను పొందుపరిచాడు.

పోర్న్ హబ్ వైస్ ప్రెసిడెంట్ రియాక్షన్

పోర్న్ హబ్ వైస్ ప్రెసిడెంట్ రియాక్షన్

పోర్న్‌హబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోరీ ప్రైస్‌ ఈ పిటిషన్‌పై స్పందించాడు. తమ వెబ్‌సైట్‌లో క్లోజ్డ్ క్యాప్షన్ ఆప్షన్ ఉందని,దానికి సంబంధించిన లిక్ సైట్‌లో కనిపిస్తుందని చెప్పారు. కాగా,పోర్న్ సైట్లపై పిటిషన్ దాఖలు చేసిన సూరి.. గతంలో ఫాక్స్ న్యూస్ చానెల్‌పై కూడా ఇదే ఆరోపణల కింద కేసు నమోదు చేశాడు. తాజా పిటిషన్‌లో ఈ నెలలో తాను చూడాలనుకుంటున్న కొన్ని అడల్ట్ వీడియోల గురించి కూడా అతను పేర్కొనడం గమనార్హం.

Recommended Video

Why Surfing P**n On Android Smartphones Is Not Safe ఫోన్‌లో పోర్న్ సైట్‌లను చూడొచ్చా..?
 క్లోజ్డ్ క్యాప్షన్ అంటే ఏమిటి..

క్లోజ్డ్ క్యాప్షన్ అంటే ఏమిటి..

క్లోజ్డ్ క్యాప్షనింగ్ అంటే ట్రాన్స్‌స్క్రిప్షన్ అని అర్థం. అంటే సినిమాలో నటీనటులు చెప్పే డైలాగ్స్‌ను ఉన్నది ఉన్నట్టుగా అక్షరాల రూపంలో తెరపై చూపించడం. అదే సబ్‌టైటిల్ విషయానికొస్తే.. అక్కడ ఆర్టిస్టుల డైలాగ్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసి చూపించడం జరుగుతుంది. పోర్న్ వీడియోల్లో క్లోజ్డ్ క్యాప్షనింగ్ ఉంటే.. చెవిటి వాళ్లు వాటిని చూసి సౌండ్స్‌ను అర్థం చేసుకుంటారని సూరి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

English summary
New York A deaf man in New York has filed a class action lawsuit against three pornographic websites on grounds he cannot enjoy their content fully without closed captions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X