ఓటమిని అంగీకరించేది లేదు.. మా బలమేంటో చూపిస్తాం !! : రష్యాకు ఉక్రెయిన్ వార్నింగ్
రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో రష్యన్ దళాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. హోరాహోరిగా జరుగుతున్న ఈ పోరులో రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం తీవ్ర నష్టం జరుగుతోంది. ఉక్రెయిన్ కీలక నగరమైన ఖార్కీవ్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తోంది. యుద్ధ విమానాల దాడుల్లో ఖార్కీవ్ పట్టణ పరిపాలనా భవనం కూలిపోయింది. అటు స్థానిక ఆస్పత్రులపై కూడా దాడులకు దిగింది.

రష్యాకు బెదిరేది లేదు..
రష్యా దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని వారి దురాక్రమణకు బయపడేదిలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హెచ్చరించారు. తమ సత్తా ఎంటో నిరూపించుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆస్పత్రులు, నివాసప్రాంతాలపై దాడులకు దిగుతూ రష్యా ఉగ్ర చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కో దురాక్రమణలను ప్రతిఘటిస్తాం.. అందులో తగ్గేది లేదని స్పష్టం చేశారు.

మా జన్మభూమి కాపాడుకుంటాం..
తమ చివరి శ్వాస వరకు పోరాడతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్ వాసుల గురించి రష్యన్లకు ఏమీ తెలీదు.. వారు ఇక్కడ ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా బలగాలు చపండానికి .. చావడానికే ఇక్కడకు వచ్చారంటూ ఫైర్ అయ్యారు. ఇది మా జన్మభూమి.. మా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మా నేలను కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మా జన్మభూమిలో మేము బలంగానే ఉన్నాం.. ఎవరికి తగ్గేదిలేదని రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. వారి దాడులతో ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ స్ఫష్టం చేశారు.

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై ఐసీజే విచారణ
.మరోవైపు రష్యా దాడులపై ఉక్రెయిన్ అంతర్జాతీయ స్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రష్యా తమ దేశంలో మరణహోమం సృష్టిస్తోందంటూ ఫిర్యాదు చేసింది. రష్యా దురాక్రమణ చర్యలను ఆపేలా చర్చలు తీసుకోవాలని కోరింది. దీంతో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై ఈనెల 7, 8 తేదీల్లో చేపట్టనుంది. అటు ఐరోపా దేశాలు రష్యాపై వరుసగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతున్నారు. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనుకడుగు వేయడంలేదు. ఉక్రెయిన్ పై మరింత దూకుడుతో వ్యవహరిస్తున్నారు..












Click it and Unblock the Notifications