• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై శాశ్వత నిషేధం -డెన్మార్క్ సంచలన ప్రకటన -రక్తం గడ్డకట్టి మరణాలు

|

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ల ద్వారానైనా ఉపశపనం లభిస్తుందనే ఆశల్ని వమ్ముచేసేలా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అత్యవసర వినియోగంలో ఫ్రంట్ రన్నర్ గా, భారత్ సహా పలు దేశాల్లో విస్తృతంగా వాడుతోన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై డెన్మార్క్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని శాశ్వతంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

  Covid-19 : Denmark Drops AstraZeneca Vaccine Permanently Over Suspected Side Effects || Oneindia

  కరోనా విలయం: ఈసీ అనూహ్యం -బెంగాల్ షెడ్యూల్ కుదింపు? -ఒకే ఫేజ్‌లో పోలింగ్? -అఖిలపక్ష భేటీకి పిలుపుకరోనా విలయం: ఈసీ అనూహ్యం -బెంగాల్ షెడ్యూల్ కుదింపు? -ఒకే ఫేజ్‌లో పోలింగ్? -అఖిలపక్ష భేటీకి పిలుపు

   ఆ టీకాతో రక్తం గడ్డ కట్టి..

  ఆ టీకాతో రక్తం గడ్డ కట్టి..

  బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థతపై తొలి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ టీకా తీసుకున్న పలువురిలో ప్రతికూల ప్రభావాలు కనిపించాయని, ఒంట్లో రక్తం గడ్డలు కట్టి మరణాలు సంభవించినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డెన్మార్క్ సహా డజనుకుపైగా యూరోపియన్ దేశాలు ఆస్ట్రాజెనెకా వాడకాన్ని తాత్కాలికంగా నిలిపేశాయి. కొన్ని రోజుల తర్వాత పలు దేశాలు తిరిగి ఆ వ్యాక్సిన్ వాడకాన్ని పున:ప్రారంభించగా, డెన్మార్క్ మాత్రం ఆస్ట్రాజెనెకాను శాశ్వతంగా నిలిపేస్తున్నట్లు బుధవారం ప్రకటన చేసింది.

  అందుకే శాశ్వత నిలిపివేత..

  అందుకే శాశ్వత నిలిపివేత..

  ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్లు గుర్తించామని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమించి, అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారని, తాత్కాలిక నిలిపివేత అనంతరం పలు పరిశీలనలు, పరిశోధనలు చేశామని, అన్ని రిపోర్టులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఆస్ట్రాజెనెకా టీకాను పూర్తి స్థాయిలో నిలిపేయాలనే నిర్ణయానికి వచ్చామని డెన్మార్క్ ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ సోరెక్‌ బ్రోస్ట్రోమ్‌ మీడియాకు చెప్పారు. ఆస్ట్రాజెనెకాను వదిలేయగా, అందుబాటులో ఉన్న ఇతర టీకాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని, జులై నాటికి పూర్తికావాల్సిన వ్యాక్సినేషన్ ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉందని డెన్మార్క్ ఆరోగ్య శాఖ పేర్కొంది. దీనిపై..

   నిలిపివేతపై ఆస్ట్రాజెనెకా స్పందన

  నిలిపివేతపై ఆస్ట్రాజెనెకా స్పందన

  ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను శాశ్వతంగా నిలిపేస్తూ డెన్మార్క్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ సంస్థ స్పందించింది. ‘‘మా టీకాలను నిలిపేయాలన్న డెన్మార్క్ నిర్ణయాన్ని గౌరవిస్తాం. రాబోయే రోజుల్లో వారు తీసుకోబోయే నిర్నయాలకు అనుగుణంగా ఎలాంటి డేటానైనా అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆస్ట్రాజెనెకాను వద్దనుకునే విషయంలో డెన్మార్క్ ఎంపికను మేం కాదనలేం. ఎందుకంటే, స్థానిక పరిస్థితుల ఆధారంగా వ్యాక్సినేషన్ పై నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆయా దేశాలే తప్ప వ్యాక్సిన్ తయారీదారులు కాదు'' అని ఆస్ట్రాజెనెకా సంస్థ ఓ ప్రకటన చేసింది. నిజానికి..

  రిస్క్ అనుకుంటే ఆ టీకాలు వాడొద్దు..

  రిస్క్ అనుకుంటే ఆ టీకాలు వాడొద్దు..

  రక్తం గడ్డలు కడుతోందనే ఫిర్యాదులపై పరిశీలన అనంతరం, ఆస్ట్రాజెనెకా, ఇతర వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని, వాటి వినియోగాన్ని కొనసాగించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థలు ఇదివరకే ప్రకనటు చేశాయి. అయితే, ఏదైనా దేశం.. తాము కొవిడ్ మరణాల కంటే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ మరణాల తీవ్రతనే ఎక్కువని భావించిన పక్షంలో సదరు వ్యాక్సిన్లను నిలిపేయాలా, వద్దా అనేది ఆయా ప్రభుత్వాల ఇష్టమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు చేతులెత్తేశాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల శాశ్వత నిలిపివేత ఒక్క డెన్మార్క్ తోనే ఆగుతుందా, ఇతర దేశాలూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటాయా అనేది వేచి చూడాలి.

  ఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూ

  English summary
  Denmark on Wednesday became the first country to stop using AstraZeneca’s Covid-19 vaccine altogether over a potential link to a rare but serious form of a blood clot. The decision will push back the scheduled conclusion of Denmark’s vaccination scheme to early August from July 25, health authorities said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X