షాక్: దొంగ ఇంట్లో దొరికిన 10వేల గన్స్(వీడియో)
దక్షిణకరోలినా: ఆ దొంగ అందరి దొంగల్లా కాదు. దొంగలెవరైనా డబ్బులు, నగదు, నగలు అపహరించుకుపోతారు. ఈ దొంగ మాత్రం ఏకంగా తుపాకులను దొంగతనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదివేల తుపాలను దొంగతనం చేసి ఇంట్లో భద్రంగా దాచుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఊరుకుంటారా? అన్ని తుపాకులను అతి కష్టమ్మీద పలు వాహనాల్లో తరలించారు. ఈ ఘటన అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పేజ్‌ల్యాండ్ సిటీలో 51 ఏళ్ల బ్రెంట్ నికోల్సన్ ఇంటి నుంచి ఈ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

సుమారు ఎనిమిది నుంచి పది వేల వరకు తుపాకులు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు.
స్వాధీనం చేసుకున్న తుపాకుల్లో ఎక్కువ శాతం దొంగలించినవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సుమారు మూడు రోజులు పాటు పోలీసులు నికోల్సన్ ఇంటిపై దాడులు చేశారు. దొంగలించిన సొత్తు విలువ రూ. ఏడు కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications