ప్రపంచ డ్యాన్స్ ఛాంపియన్స్‌గా ఇండియన్స్(వీడియో)
లాస్‌ఏంజెల్స్: భారతీయ సంప్రదాయ నృత్యానికి తిరుగులేదన్న విషయం ప్రపంచ వేదికపై మరోసారి రుజువైంది. అమెరికాలో 14 దేశాల నుంచి వచ్చిన 34 టీంలను తోసిరాజని మన దేశానికి చెందిన ‘దేశీ హాపర్స్' బృందం ప్రపంచ డ్యాన్స్ ఛాంపియన్స్‌గా అవతరించింది.
అత్యంత వేగంగా వెస్ట్రన్ మ్యూజిక్‌కు భారతీయ సంప్రదాయ నృత్యరీతుల్లో డ్యాన్స్ చేసి ఔరా అనిపించారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన డ్యాన్సర్లు కలిసి ‘దేశీ హాపర్స్' అనే నృత్య బృందంగా ఏర్పాడ్డారు.

కాగా, ఈ టీంను శంతను మహేశ్వరి, మాసెడాన్ డిమెల్లో, నిమిత్ కొటియాన్ అనే ముగ్గురు డ్యాన్సర్లు కలిసి ప్రారంభించారు. ‘భారత్ మాతాకీ జై', ‘గణపతి బప్పా మోరియా' అంటూ నినాదాలు చేయడంతో పాటు మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.
ప్రపంచ డ్యాన్స్ ఛాంపియన్లుగా అవతరించిన భారత నృత్య బృందం 5వేల డాలర్ల(రూ. 3.26లక్షల రూపాయల) చెక్కు, ట్రోఫీ అందుకుంది. దీంతోపాటు వారికి ‘క్రౌడ్ ఫేవరేట్ ట్రోఫీ' కూడా ఈ బృందం గెలుచుకుంది.












Click it and Unblock the Notifications