అచ్చం సినిమాలోలాగే: 3ఏళ్ల బాలుడిని కాల్చాడు
న్యూయార్క్: 3 ఏళ్ల బాలుడిని 11 ఏళ్ల బాలుడు కాల్చిచంపిన ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 11 ఏళ్ల బాలుడు డెట్రాయిట్‌లోని తన తండ్రి నివాసానికి వచ్చాడు.
సోమవారం తండ్రి ఇంట్లో లేని సమయంలో బెడ్‌రూమ్‌లో ఉన్న హ్యాండ్ గన్‌ను తీసుకున్నాడు. అనంతరం ఆడుకునేందుకు ఇంటికి వెనుక వైపు ఉన్న కారు వద్దకు వెళ్లాడు. అక్కడ కారులో ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలుడు ఎలిజా వాకర్ వద్దకు వెళ్లి అతనిపై పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపాడు.

దీంతో ఎలిజా వాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఎలాంటి కారణం లేకుండా నిందితుడు కాల్పులు జరిపాడని, ఇది కావాలని చేసిందేనని భావించి అతడిపై హత్య అభియోగాలు నమోదు చేసినట్టు ప్రాసిక్యూటర్ తెలిపారు.
అయితే బాలుడి తల్లిదండ్రులు మాత్రం ఆడుకునే బొమ్మ తుపాకి అనుకుని కాల్చి ఉంటాడని, ఇందుకు తక్కువ శిక్ష వేయాల్సిందిగా జడ్జిని కోరారు. ఐదువేల డాలర్లు పూచీకత్తుగా కట్టి బాలుడిని బెయిల్‌పై తల్లిదండ్రులు విడిపించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications