దేవయాని ఇష్యూలో ట్విస్ట్: ఐరాస గుర్తింపు, దౌత్యరక్షణ
న్యూయార్క్: దౌత్యకారిణి దేవయాని అంశంలో మరో కొత్త మలుపు. డిసెంబర్ 12వ తేదీన దేవయానిని అరెస్టు చేసిన సమయంలో ఆమెకు వ్యక్తిగత అరెస్టు, నిర్బంధం నుండి మినహాయింపును కల్పిస్తూ అప్పటికే పూర్తిస్థాయిలో దౌత్యపరమైన రక్షణ ఉంది. వీసా వ్యవహారంలో మోసానికి పాల్పడిందన్న ఆరోపణలతో అమెరికా పోలీసులు ఈ నెల 12వ తేదీన న్యూయార్క్‌లో దేవయానిని బహిరంగంగా అరెస్టు చేసి దారుణంగా అవమానించిన విషయం తెలిసిందే.
అయితే దేవయానికి వ్యక్తిగత అరెస్టు, నిర్బంధం నుంచి మినహాయింపును కల్పిస్తూ అప్పటికే పూర్తిస్థాయిలో దౌత్యపరమైన రక్షణ ఉన్నప్పటికీ అమెరికా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లో భారత డిప్యుటీ కాన్సల్ జనరల్‌గా నియమితురాలైన దేవయాని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత రాయబార కార్యాలయ సలహాదారుగా గుర్తింపును కలిగి ఉన్నారు.

ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఆగస్టు 26వ తేదీన కల్పించిన ఈ గుర్తింపు ఈ నెలాఖరు వరకు (డిసెంబర్) చెల్లుబాటు అవుతుంది. ఐక్యరాజ్య సమితి హక్కులు, రక్షణలకు సంబంధించిన నిబంధనావళి ఆర్టికల్ 4లోని 11ఎ సెక్షన్ ప్రకారం సమితి సభ్యుల ప్రతినిధులను వ్యక్తిగతంగా అరెస్టు చేసేందుకుగానీ, వారి సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు గానీ వీలుండదు.
ప్రతినిధి అనే పదాన్ని ఈ ఆర్టికల్ సవివరంగా నిర్వచిస్తోంది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, ఉప ప్రతినిధులతో పాటు సలహాదారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధి బృందాల కార్యదర్శులను కూడా సమితి ప్రతినిధులుగానే పరిగణించడం జరుగుతుందని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తోంది. కనుక ఈ నెల 12వ తేదీన దేవయాని అరెస్టు ఆమె హోదాకు విరుద్ధంగా జరిగిందంటున్నారు. ఈ విషయాన్ని భారత్ అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకు వెళ్లింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications