దేవయాని ఇష్యూ: టిట్ ఫర్ టాట్, భారత్ ప్రతిచర్య
న్యూఢిల్లీ: అమెరికా, భారతదేశాల మధ్య దౌత్య యుద్ధం ప్రారంభమైంది. తన దౌత్యవేత్త దేవయానిని అభిశంసించి అభియోగాలు నమోదు చేసి అమెరికా వెనక్కి పంపిన నేపథ్యంలో, భారత్ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే శుక్రవారం అంతే తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. వీసా దగా కేసులో దేవయానిని అభిశంసిస్తూ అభియోగాలను నమోదు చేసిన అమెరికా చర్యను గర్హించిన భారత్, దెబ్బకు దెబ్బ అన్న రీతిలో వ్యవహరించింది.
ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో డైరెక్టర్ ర్యాంక్ అధికారిని 48 గంటల్లోగా వదిలి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. అమెరికా దౌత్యవేత్తను భారత్ బహిష్కరించడం అనేది గత 33ఏళ్లలో ఇదే మొదటిసారి. గతంలో రాజకీయ కౌన్సిలర్‌గా పని చేసిన జార్జి గ్రిఫిన్‌పై ఈ చర్య తీసుకుంది. అప్పట్లో భారత్ దౌత్యవేత్త ప్రభాకర్ మీనన్‌ను అమెరికా బహిష్కరించడానికి ప్రతీకారంగానే గ్రిఫిన్‌పై కూడా బహిష్కరణ వేటు వేసింది. అయితే ఈ తాజా కేసుకు సంబంధించి బహిష్కరణ అన్న మాట ఉపయోగించకుండా దేవయాని స్థాయి అధికారిక హోదా కలిగిన దౌత్యవేత్తను వెనక్కి తీసుకోవాలని మాత్రమే అమెరికా ఎంబసీని కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

దేవయాని వ్యవహారంలో ఈ అధికారే కీలక పాత్ర వహిస్తున్నారని, అమెరికా ఏకపక్ష నిర్ణయానికి ఆయన ధోరణే కారణమని భావించడం వల్లే ఆయన్ని బహిష్కరించాలని నిర్ణయించినట్టుగా అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఆ దౌత్యవేత్త పేరును మాత్రం వెల్లడించలేదు. కోబ్రాగాదె వద్ద పనిమనిషిగా పని చేసిన సంగీతా రిచర్డ్‌ను తరలించే విషయంలో ఈ దౌత్యవేత్తే క్రియాశీలక భూమిక పోషించినట్టు చెబుతున్నారు.
అమెరికా అధికార ట్రావెల్ ఏజెన్సీ జారీ చేసిన టికెట్లతోనే సంగీతా రిచర్డ్ భర్తను, ఇద్దరు పిల్లలను తరలించినట్టుగా స్పష్టమవుతోంది. ఈ విమాన టిక్కెట్ల రేట్ల విషయంలో తన దౌత్యాధికారాన్ని ఉపయోగించుకుని ఈ అధికారే మినహాయింపును కూడా ఇచ్చినట్టు భావిస్తున్నారు.
దేవయానిపై దాఖలు చేసిన కేసు ప్రాథమిక విచారణ విషయంలో రాజీ పడేది లేదని, అనుకున్న ప్రకారం ఈనెల 13న కేసును చేపడతామని అమెరికా స్పష్టం చేయడం, అలాగే, అక్కడి జ్యూరీ ఆమెను అభిశంసించి వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించడంతో వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications