దేవయానిపై సారీ చెప్పాలి: ఏడ్చిన సోదరి, డైరీలో ఓ పేజీ
న్యూఢిల్లీ: భారత దౌత్యాధికారిణి దేవయాని పైన పెట్టిన కేసును అమెరికా తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గురువారం అన్నారు. దేవయాని కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సల్మాన్ అడిగారు. మరోవైపు దేవయాని ఇష్యూ పైన అమెరికా క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్రమంత్రి కమల్ నాథ్ అన్నారు. దేవయానిని అరెస్టు చేసి, ఆమె దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం దారుణమన్నారు. తమను సంతృప్తి పర్చాలంటే అమెరికా క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.
బుధవారం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ శివశంకర్ మీనన్‌కు ఫోన్ చేసి పశ్చాత్తాపం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కమల్ నాథ్ స్పందిస్తూ.. పశ్చాత్తాపం కాదని, క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. పశ్చాత్తాపంతో తాము సంతృప్తి చెందలేదన్నారు. వారి తీరుకు కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. మరో కాంగ్రెసు నేత రాజ్ బబ్బర్ మాట్లాడుతూ.. దీనిని సహించేది లేదన్నారు.

దేవయాని పని మనిషి డైరీలో ఓ పేజీ
కాగా, దేవయాని పనిమనిషి సంగీత డైరీ నుండి ఓ పేజీని బయట పెట్టిన దేవయాని సోదరి కన్నీటి పర్యంతమయ్యారు. దేవయాని సోదరి సంగీత డైరీలోని ఓ పేజీని ఫేస్‌బుక్‌లో పెట్టారు. అందులో సంగీతకు దేవయాని రూ.30వేలను, ఇతర అలవెన్సులను ఎలా ఇస్తోంది ఉంది.
అంతేకాకుండా సంగీతకు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్లేంత స్వేచ్ఛ ఉందని, అలాగే ఎలాంటి పని ఒత్తిడి లేదని అందులో ఉంది. తమ పిల్లలు దేవయానిని ఇష్టపడే వారని, తమకు ఉండేందుకు ప్రత్యేక స్థలమిచ్చారని, ఇటీవలే ఐపాడ్‌ను బహుమతిగా ఇచ్చారని డైరీ పేజీలో ఉంది.
అంతకుముందు దేవయాని సోదరి మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. దేవయాని మౌనంగా ఉన్నంత మాత్రాన ఆమె తప్పు చేసినట్లు కాదన్నారు.












Click it and Unblock the Notifications