Christmas Celebrations:క్రిస్మస్‌ కోసమే ఆదేశంలో ఓ చేపను పెంచుతారట,ఇంట్రెస్టింగ్..!

మరో మూడు రోజుల్లో క్రిస్మస్ పండగ రానుంది. డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినం. క్రీస్తు జన్మదినం పురస్కరించుకుని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇళ్లను డెకొరేట్ చేసుకోవడం నుంచి క్రిస్మస్ చెట్టు, స్టార్ ఇతరత్రా హంగామా చేసేస్తున్నారు. ఎక్కడ చూసిన చర్చీలను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. రాత్రి వేళల్లో క్రిస్మస్ క్యారోల్స్‌ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రపంచ దేశాలన్ని క్రిస్మస్ వేడుకను ఒక్కో పద్ధతిలో జరుపుకుంటాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

 ఫిలిప్పీన్స్‌ దేశంలో ఆరునెలల పాటు క్రిస్మస్ వేడుకలు

ఫిలిప్పీన్స్‌ దేశంలో ఆరునెలల పాటు క్రిస్మస్ వేడుకలు

ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం క్రిస్మస్ వేడుకను ఘనంగా జరుపుకుంటాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కొంచెం వెరైటీగా సెలబ్రేషన్స్ ఉంటాయి. ముందుగా ఫిలిప్పీన్స్‌లో క్రిస్మస్ ఎలా జరుపుకుంటారో చూద్దాం. ఫిలిప్పీన్స్‌లో క్రిస్మస్ వేడుకలను దాదాపు ఆరునెలలు పాటు నిర్వహిస్తారు. సెప్టెంబర్ నుంచే డెకరేషన్లు లేదా అలంకరణలు ప్రారంభమవుతాయి.జనవరి మొదటి ఆదివారం వరకు ఈ అలంకరణలు ఉంటాయి. పేపర్ లాంతర్లతో ఫిలిప్పీన్ దేశస్తులు తమ ఇళ్లను అలంకరించుకుంటారు. అంతేకాదు క్రిస్మస్ పండగ రోజున కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువులు అంతా కలిసి భోజనం చేయడం చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.

 జపాన్‌లో కేఎఫ్‌సీ చికెన్ తినేందుకు ఇష్టపడతారు

జపాన్‌లో కేఎఫ్‌సీ చికెన్ తినేందుకు ఇష్టపడతారు

జపాన్‌లో క్రిస్మస్ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇతర క్రిస్టియన్ మెజార్టీ దేశాలకంటే జపాన్‌లో క్రిస్మస్‌ను మరింత లౌకిక పద్ధతిలో జరుపుకుంటారు. క్రిస్మస్ అనేది దంపతులు లేదా లవ్ కపుల్ మరింత రొమాంటిక్‌గా జరుపుకుంటారు. ఇక పండగ రోజున జపాన్‌ కుటుంబాలు కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) తినేందుకు చాలా ఇష్టపడతారు.కేఎఫ్‌సీ చికెన్‌ను ఒక సంప్రదాయ వంటకంగా భావిస్తారు.

 క్రిస్మస్ పండగ కోసం ఓ చేపను పెంచే పోలాండ్ వాసులు

క్రిస్మస్ పండగ కోసం ఓ చేపను పెంచే పోలాండ్ వాసులు


పోలాండ్‌లో క్రిస్మస్ మరింత జాలీగా జరుపుకుంటారు. కానుకలు ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు చర్చి సర్వీసులు ఉంటాయి. ఇక హోం అలోన్ చిత్రంను కచ్చితంగా ఆరోజు చూస్తారు. ఇక పండగ రోజున కార్ప్ అనే చేపను వారంతా కోసుకుని వండుకుని తింటారు. క్రిస్మస్ కంటే కొన్ని రోజుల ముందే ఈ చేపను ఇంటి యజమానురాలు కొని నీళ్లు ఉన్న టబ్‌లో వేస్తుంది. క్రిస్మస్ రోజున ఈ చేపను కోసి కూర చేస్తుంది. ఇది పోలాండ్‌లో సంప్రదాయంగా వస్తోంది. ఈ చేప తింటే అదృష్టం వరిస్తుందని వారు నమ్ముతారు.

బీచ్‌లపై క్రిస్మస్ జరుపుకోనున్న ఆస్ట్రేలియన్లు

బీచ్‌లపై క్రిస్మస్ జరుపుకోనున్న ఆస్ట్రేలియన్లు


ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వెరైటీగా జరుపుకుంటారు. ఆస్ట్రేలియన్లు క్రిస్మస్‌ను బీచ్ వద్ద జరుపుకుంటారు. మధ్యాహ్నం బార్బీక్యూ వంటకాలు చేసుకుని అక్కడే భోజనం చేస్తారు. ఇక బీచ్‌పై క్రికెట్ ఆడతారు. అనంతరం సముద్రంలో స్నానం చేసి ఇక భోజనం చేస్తారు. బీచ్ మీద ఉన్న మట్టి మొత్తం తెలుపు రంగులో ఉండటం వల్ల ఇక్కడ జరిగే వేడుకను వైట్ క్రిస్మస్ అని కూడా పిలుస్తారు.

ఉక్రెయిన్

ఉక్రెయిన్

ఉక్రెయిన్‌లో క్రిస్మస్‌ను డిసెంబర్ 25వ తేదీ కాకుండా జనవరి 7వ తేదీన జరుపుకుంటారు. ఎందుకంటే వారు జూలియన్ క్యాలెండర్‌ను ఫాలో అవుతారు. ఇక ఆకాశంలో తొలి నక్షత్రాన్ని చూసేవరకు వారు క్రిస్మస్ డిన్నర్ చేయరు.ఇక అప్పటి వరకు కారోల్స్‌లో నిమగ్నమవుతారు.

 క్రిస్మస్ రోజున కేకును రమ్‌లో ముంచే జమైకా వాసులు

క్రిస్మస్ రోజున కేకును రమ్‌లో ముంచే జమైకా వాసులు

జమైకాలో క్రిస్మస్ వేడుకలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ వేడుకలు నాన్‌స్టాప్‌గా ఉంటాయి. షాపింగ్ దగ్గర నుంచి పండగ వరకు అన్నీ ప్రత్యేకమే. చాలా నగరాల్లో గ్రాండ్ మార్కెట్లు దర్శనమిస్తాయి. ఇక ఎటు చూసినా ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను , ఫుడ్ ఐటెమ్స్‌ను అమ్ముతారు.ఓ వైపు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ మరోవైపు ప్రత్యేకంగా అల్లంతో తయారు చేసిన తియ్యటి జ్యూస్‌ను తాగుతూ సరదాగా గడుపుతారు. అంతేకాదు ఫ్రూట్ కేక్ క్రిస్మస్ రోజున చాలా ప్రత్యేకం. ఈ ఫ్రూట్‌ కేక్‌ను రమ్‌లో ముంచి ఆరగిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+