సెలవుల జాబితాలో ముస్లిం పండుగలకు చోటు, దీపావళికి లేదు: హిందువులు ఆగ్రహం

న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్ డి బ్లాసియో హిందువులు ఆగ్రహనికి గురయ్యారు. ఇందుకు కారణం మంగళవారం ప్రకటించిన ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి పండుగ లేకపోవడంతో స్ధానికంగా ఉన్న హిందువులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అంతేకాదు ముస్లింల పండుగలైన ఈద్-ఉల్-ఫితర్, ఈద్ అల్-అదాలకు ప్రభుత్వ సెలవుల జాబితాలో చేర్చిన అధికారులు దీపావళి పండుగను ఎందుకు చేర్చలేదని నిలదీశారు. దీపావళి పండుగను ప్రభుత్వ సెలవుల జాబితాలో చేర్చకపోడవంపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ విచారం వ్యక్తం చేసింది.

హిందూ అమెరికన్ ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ షీతల్ షా మాట్లాడుతూ వేలాదిగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దీపావళి పండుగను సెలవుల జాబితాలో చేర్చకుండా, రెండు ముస్లిం పండుగలను సెలవుల జాబితాలే చేర్చడం విచారకరమని అన్నారు. న్యూయార్క్‌లోని 40 సంస్ధలతో మేయర్‌ను కలిశామని, దీపావళికి సెలవు ప్రకటించాలని కోరామని తెలిపారు.

Diwali not on holiday list, Hindus disappointed

స్ధానిక గణేష్ గుడి అధ్యక్షురాలు ఉమ మైసోర్కర్ మాట్లాడుతూ సిటీలోని ఫ్యామిలీలు ఒక చోట చేరి సంబురంగా చేసుకొనే అతి పెద్ద పండుగ దీపావళి అన్నారు. దీపావళికి సెలవు లేదని స్కూలు విద్యార్ధులు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. మన నమ్మకాలకంటే స్కూలు, పరీక్షలు ఎంత మాత్రం ముఖ్యం కాదన్నారు.

న్యూయార్క్ సిటీలో ముస్లిం పండుగలకు సెలవులను ప్రకటించిన మేయర్ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్.... దీపావళి పండుగను కూడా ఆ జాబితాలో చేరిస్తే బాగుండేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+