వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ వ్యాధి లక్షణాలు పూర్తిగా ఎప్పుడు బయటపడుతాయో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్... ఎక్కడ ముగ్గురు నలుగురు ఒకేదగ్గర చేరినా వారు చర్చించుకునే అంశం ఇదే ప్రధానంగా ఉంటోంది. ఈ మహమ్మారి రోజురోజుకు విరుచుకుపడుతోంది. చైనాలోని వూహాన్ నగరం కేంద్రంగా బయటపడ్డ ఈ అంటువ్యాధి రక్కసి ఏకంగా 100 దేశాలకు పైగా వ్యాపించి ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ మాయదారి వ్యాధిన పడి 4వేలకు పైగా మృతి చెందారు. ఇక భారత్‌లో కోవిడ్ -19 బారిన పడిన వారి సంఖ్య 75కు చేరుకుంది. అయితే ఈ కరోనా వైరస్ లక్షణాలు పూర్తిగా బయటపడేందుకు ఎన్ని రోజులు తీసుకుంటుంది.. ఈ విషయం తెలియక చాలామంది అలానే ఉండిపోతున్నారు. ఫలితం అది క్రమంగా పక్కనున్న వారికి సోకుతోంది.

 వైరస్ లక్షణాలు వెంటనే బయటపడవు

వైరస్ లక్షణాలు వెంటనే బయటపడవు

ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకిందంటే అది పక్కనున్న వ్యక్తికి కూడా చాలా తేలిగ్గా వ్యాపిస్తుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్ష పద్ధతిలో ఆ వ్యక్తితో టచ్‌లోకి వస్తే ఈ మహమ్మారి ఇట్టే పాకేస్తుందని వైద్యులు చెబుతున్నారు. జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా లేదా ముక్కు కారుతుండటం వంటివి కరోనావైరస్ లక్షణాలు. అయితే ఈ లక్షణాలున్న వ్యక్తుల్లో వైరస్ అనేది వెంటనే పూర్తి స్థాయిలో బయటపడదు. జ్వరం, జలుబు లాంటి వాటితో బాధపడుతున్నప్పటికీ ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పలేం. కోవిడ్-19 లక్షణాలు పూర్తిస్థాయిలో బయటపడేందుకు కొంత సమయం తీసుకుంటుంది.

రెండు నుంచి 14 రోజుల సమయంలో...

రెండు నుంచి 14 రోజుల సమయంలో...

ఒక వ్యక్తిలో కరోనావైరస్ లక్షణాలు పూర్తి స్థాయిలో బయటపడేందుకు రెండు రోజుల నుంచి 14 రోజుల సమయం పడుతుందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థలు చెబుతున్నాయి. అందుకే కరోనావైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ టచ్‌లోకి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఒక ప్రత్యేక గదిలో తనకు తాను ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

 సగటున ఇంక్యుబేషన్ సమయం 5 నుంచి 6 రోజులు

సగటున ఇంక్యుబేషన్ సమయం 5 నుంచి 6 రోజులు

ఇక కోవిడ్-19 ఇంక్యుబేషన్ సమయం సగటున 5 నుంచి 6 రోజుల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే ఇది 1-14 రోజుల వరకు కూడా ఉండొచ్చని చెబుతోంది. అంటే దీనర్థం ఒకవేళ ఒక వ్యక్తికి ఇన్‌ఫెక్షన్ సోకితే దీని లక్షణాలు బయటపడేందుకు సగటున ఆరురోజులు సమయం లేదా 14 రోజుల సమయం కానీ పడుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. కోవిడ్-19తో బాధపడే వారిలో ముందుగా జ్వరం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది వైరస్ సోకిన 5 నుంచి 6 రోజులకు తెలుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Recommended Video

3 Minutes 10 Headlines : Coronavirus || Bill Gates Quit || Karnataka Bandh || Oneindia Telugu
జాగ్రత్తలు చెబుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

జాగ్రత్తలు చెబుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఈ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. తరచూ చేతులు నీటితో శుభ్రం చేసుకోవడం, జనసమ్మర్దత ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అంతేకాదు ముఖాన్ని, ముక్కును, కళ్లను చేతులతో ముట్టడంవంటి చేయరాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.

English summary
A person might be infected with the novel coronavirus but show no symptoms initially.It takes 2-14 days time to show the complete symptoms. కరోనావైరస్ సోకిన వ్యక్తికి అప్పుడే లక్షణాలు బయటపడవని పూర్తి స్థాయిలో లక్షణాలు బయటపడేందుకు 2 నుంచి 14 రోజుల సమయం పడుతుదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X