Donald Trump: అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా..!
ప్రపంచంలో అగ్ర రాజ్యం అంటే అమెరికానే.. అలాంటి అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆ దేశ అధ్యక్షుడు ఉండే నివాసం ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. అంతే కాదు.. ఆ దేశ అధ్యక్షుడు తీసుకునే జీతం కూడా అంతే భారీ స్థాయిలో ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు అయ్యాడంటే.. రాజభోగమే.. అత్యాధునిక సౌకార్యాలు, భారీ భద్రత, భారీ జీతం ఉంటుంది. అందుకే అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేకత ఉంటుంది.
అగ్రరాజ్య అధ్యక్షుడి వైట్ హౌస్ సకల సౌకర్యాలు ఉంటాయి. మీద ఈగ వాలకుండా భద్రత ఉంటుంది. ఇక ఆ దేశ అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లినా అంతే స్థాయిలో భద్రత ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నవారికి సంవత్సరానికి 4 లక్షల డాలర్ల జీతం ఉంటుంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ.3.3 కోట్లకు సమానం. ఈ జీతానికి సంబంధించి అమెరికా కాంగ్రెస్ 2001లో నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీతంలో ఎలాంటి మార్పు చేయలేదు.

ప్రయాణ ఖర్చుల కోసం లక్ష డాలర్లు, వినోదం కోసం 19 వేల డాలర్లు కేటాయిస్తారు. వీటితో పాటు వ్యక్తిగత, అధికారిక ఖర్చుల కోసం 50 వేల డాలర్లు ఉంటాయి. మొత్తానికి అమెరికా అధ్యక్షుడికి జీతంతో పాటు అయ్యే ఖర్చు 5.69 లక్షల డాలర్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.4.7 కోట్లగానే ఉంటుంది. ఇది కాకుండా శ్వేత సౌధాన్ని అలకరించడానికి లక్ష డాలర్లు కేటాయిస్తారు. అమెరికా అధ్యక్షుడి నుంచి దిగిపోయిన తర్వాత కూడా జీతం వస్తుంది. సంవత్సరానికి 2 లక్షల డాలర్లు వస్తాయి. ఇందులో అలవెన్సు కోసం 1 లక్ష డాలర్లు ఇస్తారు.
ప్రపంచంలో సింగపూర్ ప్రధాని అత్యధిక జీతం తీసకుంటున్నారు. ఆయన సంవత్సరానికి 16 లక్షల డాలర్లు తీసుకుంటారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ.13 కోట్లకు పైనే ఉంటుంది. ఇక అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ ను 1800 సంవత్సరంలో నిర్మించారు. ఇందులో ఆరు అంతస్థులు, 132 గదులు ఉంటాయి.












Click it and Unblock the Notifications