భూమిపై ఉన్న అంతరిక్ష శ్మశానవాటిక ఎక్కడుందో తెలుసా...?
ఈ భూమండలంపై మానవుడు చేరుకోవడం కూడా అసాధ్యం అనిపించే మారుమూల ప్రదేశం ఒకటుంది. ఇక్కడికి మనిషి చేరుకోవాలంటే వేలకిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే పాయింట్ నిమో. ఈ పాయింట్ నిమో అంటార్కింటికా నుంచి ఉత్తరాణ 3000 మైళ్లు.. న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ల దూరంలో ఫసిఫిక్ మహాసముద్రంలో గుర్తించబడింది. భూమి పైభాగాన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోని నివసించే వ్యోమగాములే పాయింట్ నిమోకు దగ్గరగా ఉండే జీవులుగా చెప్పొచ్చు. ఈ పాయింట్ ఐఎస్ఎస్‌కు సుమారు 400 కిలోమీటర్ల ఎగువన ఉంది.
అంతేకాదు, ఈ ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో, కాలం చెల్లిన ఉపగ్రహాలు ఇతర అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా ప్రణాళికలు వేసుకుంటారు. దీంతోపాటు 2030 నాటికి ఐఎస్ఎస్ కాలం కూడా ముగిసిపోనుండడంతో ఐఎస్ఎస్ కూడా సముద్రగర్భంలో పాయింట్ నిమో వద్దే కలిసిపోనుంది. అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేసే ఈ ప్రదేశాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశానవాటికగా పిలుస్తారు.

మానవాళికి పెను సవాలు...:
పాయింట్ నెమోని ఓషియానిక్ పోల్ ఆఫ్ అక్సెసిబిలిటీ లేదా 'దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతం'గా చెబుతుంటారు. నిజానికి, 1992లో కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హ్ర్వోజే లుకటేలా దాని ఖచ్చితమైన కోఆర్డినేట్‌లను ముందుగా గుర్తించాడు. అలాగే 2019 అధ్యయనం ప్రకారం..ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయినట్లు లెక్కగట్టారు. అంతేకాదు, నాసాకు చెందిన స్కైలాబ్, రష్యా మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చివేయబడ్డాయి. ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ, ఈ సముద్రం అడుగుభాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్ వ్యర్థాల మోతాదు మానవాళికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను విసరబోతుందోనని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు పర్యావరణ వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. మరీ ఈ అంతరిక్ష శ్మశానవాటిక మానవ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications